Revanth Reddy On Central Budget 2023: 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. 2014లో విభజన చట్టంలో తెలంగాణకు కేటాయించిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీల గురించి ఈ బడ్జెట్‌లో ప్రస్తావించనే లేదని మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్రం విఫలమైందని.. మోడీ ప్రభుత్వం గతంలో చేసిన వాగ్దానం మేరకు ఎలాంటి ప్రస్తావనలు లేవని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి ఎన్నికలు వస్తున్నందున.. నీటి ప్రాజెక్టు కోసం నిధులు కేటాయించిందన్నారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం పూర్తిగా విస్మరించిందని వ్యాఖ్యానించారు. అన్ని విధాలుగా తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు జరిగిన అన్యాయంలో బీజేపీ , బీఆర్ఎస్ ఇద్దరూ దోషులేనని విమర్శించారు.
INDvs NZ T20: గిల్ సూపర్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోరు
కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాసంక్షేమం పట్టకుండా.. కేవలం ఎన్నికలున్న రాష్ట్రాల్లో గెలవాలన్న ప్రాతిపదికన కేటాయింపులు చేశారన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిపై ఎలాంటి స్పష్టత లేకుండా నిధులు కేటాయించారని ఫైర్ అయ్యారు. బడ్జెట్‌లో తెలంగాణకు ఇచ్చిన కేటాయింపులు చూసి.. తీవ్ర నిరాశ ఆవహించిందన్నారు. పేదలకు ఇళ్లు కల్పిస్తామన్న హామీని అమలు చేయలేదని.. బడ్జెట్‌లో ఐటీఐఆర్ కారిడార్ ప్రస్తావనే లేదని.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని.. అసలు దేనికి ప్రాధాన్యం ఇవ్వలేదని అన్నారు. తెలంగాణకు రావాల్సిన వాటిని కేసీఆర్ సాధించలేదని విమర్శించారు. జరిగిన తప్పును కేంద్ర సరిదిద్దాలని తమ కాండ్రెస్ పార్టీ జెండా డిమాండ్ చేస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Tammineni Veerabhadram: కేంద్ర బడ్జెట్.. తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ఉంది