DCCB Director Kidnap: నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ పరిధిలో పొనకల్ గ్రామంలో జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. బాధితుడు చిక్యాల హరీష్ కుమార్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించి ఇంట్లోకి చొరబడి బంగారం, నగదుతో పాటు వాహనం దొంగలించిన కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్లి నది స్నానం ఆచరించడానికి వెళ్ళి ఐదుగురు యువకులు నదిలో మునిగి మరణించారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు, మిగతా ఇద్దరు వీరి సమీప బంధువులు ఉండటం వల్ల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్ చింతల్, దిల్సుక్ నగర్ కి చెందిన 18 మంది బాసర పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్లారు అందులో భాగంగా నది స్నానం ఆచరించడానికి బోట్ లో నది మధ్యలో గల దీవి…
Minister Seethakka: నిర్మల్ జిల్లా కలెక్టర్ పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేసింది. నాయక్ పోడులు అంటే నిర్మల్ జిల్లా కలెక్టర్ కు తెలియకపోవడం బాధాకరం అన్నారు. అధికారిగా ఉన్నప్పుడు వాళ్లు అన్ని తెలుసుకోవాలని సూచించింది. ఏ కులం, ఏ రిజర్వేషన్ వస్తదో తెలియకపోవడం వారి తప్పు.. రాజ్యంగాన్ని చదవాలని తెలిపింది.
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధం అయింది. ఆర్జీయూకేటీ బాసర ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రాం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల తేదీ ఖరారు అయింది.
Basara Triple IT: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో నాలుగు మెస్ టెండర్ల ఎంపిక ప్రక్రియపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలోని కాంట్రాక్టర్లకే మళ్ళీ అప్పగించేలా చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు.
Basara IIIT: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో నాలుగు మెస్ లకు ఆన్ లైన్ టెండర్లు పిలిచింది. మార్చి 20వ తేదీ నుంచి టెండర్ల ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే, వచ్చిన ప్రైస్ బిడ్ లను తెరిచి టెక్నికల్ ప్రాసెస్ పూర్తి చేసింది కమిటీ.
తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు దాటింది. రాష్ట్రంలోని 7 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.. ఈ ఏడు జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది..
నిర్మల్ లో ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇవి వదంతులు మాత్రమే అని, అసత్య వార్తలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కడెం జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ పలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నవి అసత్యపు వార్తలని స్పష్టం చేశారు. అవాస్తవ సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి ప్రశ్నాపత్రం లీక్ కాలేదని,…
Shivaraj Yogi : మహాశివరాత్రి హిందూమతంలోని అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటి. ఈ పండుగను దేశవ్యాప్తంగా, ఇంకా ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులు ఎంతో భక్తి, శ్రద్ధతో జరుపుకుంటారు. సాధారణంగా ఫాల్గుణ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి తిథిని మహాశివరాత్రిగా పాటిస్తారు. ఈ రోజు శివభక్తులకు విశేష ప్రాముఖ్యత కలిగి ఉండటమే కాకుండా, ఆధ్యాత్మికమైన విలువలు నిండిన రోజుగా భావించబడుతుంది. అయితే.. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్‌కు చెందిన మహదేవ్ శక్తి సంస్థాన్, రాజశ్యామల పీఠం ఆధ్వర్యంలో…
బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరిగాయి. భక్తి శ్రద్ధలతో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరి నది ఒడ్డున శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 286వ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క ఎస్టీలకు గుడ్ న్యూస్ అందించారు. ఎస్టీల కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొమరం భీం…