నిర్మల్‌లో అట్టహాసంగా అమిత్ షా సభ నిర్వహించిన కమలనాథులు.. బొమ్మలాట పంచాయితీకి దిగారా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఈ అంశమే బీజేపీ నేతలకు తలనొప్పి తెచ్చిపెడుతోందా? పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ జోక్యం చేసుకున్నా సెగలు అలాగే ఉన్నాయా? ఇంతకీ ఏంటా గొడవ? లెట్స్ వాచ్..! బీజేపీలో నిర్మల్ సభ ప్రకంపనలు..! ఈ ఏడాది తెలంగాణలో బీజేపీ నిర్వహించిన విమోచన దినోత్సవ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ వేదికైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్…
గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలిచాం.. మూడు చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాం.. కానీ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ఎంపీ సీట్లు బీజేపీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా… నిర్మల్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు విమోచన శుభాకాంక్షలు తెలిపారు.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత…
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. రేపు నిర్మల్ వస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అమిత్‌షా పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కమలనాధులు. వెయ్యి ఉరుల మర్రి సమీపంలో భారీబహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే సభాస్థలిని కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకొని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి. ఢిల్లీ నుంచి నాందేడ్ రానున్న ఆయన.. అక్కడ నుంచి నిర్మల్ వస్తారు.. వెయ్యి…
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు.. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన నిర్మల్‌కు వచ్చేయనున్నారు.. తెలంగాణ విమోచన సభను నిర్మల్ లో నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.. అయితే, 17వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ పడనుంది.. ఇప్పటికే సంజయ్ పాదయాత్ర 100 కిలోమీటర్ల మైలు రాయిని దాటేసింది.. అయితే, 17వ తేదీన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర…
తెలంగాణ రాష్ట్రంలో దళితుడే ముఖ్యమంత్రి అని నమ్మించి మోసం చేసిన సీఎం కేసీఆరే దళితుల ప్రధాన శతృవు అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఏడేండ్లపాలనలో దళితులకు అన్యాయమే జరిగింది, ఏనాడూ దళితబంధు కాలేదు.. కేసీఆర్ రాబందులా కనిపిస్తున్నాడు అంటూ మందకృష్ణ విమర్శలు చేశారు. కేసీఆర్ అవసరమైన సమయంలో ఎదో నిర్ణయం తీసుకుంటాడు ఆతర్వాత పక్కకు పడేస్తాడు. హుజూరాబాద్ లో మెజార్టీ ఓట్లు దళితుల ఉన్నాయి కాబట్టే పైలట్ ప్రాజెక్టుగా దళితబంధు తీసుకొచ్చాడు,…
నిర్మల్ జిల్లా నీటిమయమైంది. జిల్లా అంతటా ఎటు చూసినా వరదలే కనిపిస్తున్నాయి. ప్రధాన వీధులు శివారు ప్రాంతాలు జలమయమైయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగి వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమములోనే రహదారులపైకి భారీగా చేపలు వచ్చాయి. దీంతో పలువురు స్థానికులు రోడ్లపై చేపలు పట్టారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక నిర్మల్ వరద పరిస్థితిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో సీఎం కేసీఆర్ ఆరా తీశారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి…
నిర్మల్ జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. ఉపాధి హామీ అధికారిపై ఓ సర్పంచ్ పెట్రోల్ దాడికి పాల్పడ్డాడు. జిల్లాలోని కుబీర్ మండలంలోని సాంగ్లీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఈజీఎస్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల కోసం సర్పంచ్ సాయినాథ్ ఉపాధి హామీ కార్యాలయానికి వచ్చారు. గ్రామంలో గ్రావెల్ వర్క్ విషయమై మాస్టర్ రిజిష్టర్‌లో సంతకం పెట్టాలని టెక్నికల్ అసిస్టెంట్ రాజుపై సర్పంచ్ సాయినాథ్ ఒత్తిడి తీసుకువచ్చాడు. అందుకు రాజు నిరాకరించాడు. దీంతో ముందే పక్కా ప్లాన్ ప్రకారం…
భార్య ప్రియుడితో కలిసి ఉండగా భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. భైంసా పట్టణంలోని ఏ.పి నగర్ కాలనీలో ప్రియుడితో కలిసి ఉండగా భర్తకు రెడ్ హ్యాండెడ్ గా భార్య దొరికింది. కాగా భార్య, ప్రియుడిని గదిలో ఉండగా బయటి నుండి తాళం వేసిన భర్త రాజు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే చాలా సేపు బయటకి రాకుండా లోపలే గడియ పెట్టుకుని పోలీసులకు చుక్కలు చూపించారు. ప్రస్తుతం ఆ…