Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ పదేళ్ల తర్వాత అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన వారిలో ఆరుగురు ఈ సారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతో వెళ్లడంతో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎల్లపల్లి గ్రామంలో ఓటు హక్కు వేశారు.
CM KCR: బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్మల్, నిజమాబాద్, జగిత్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల పర్యటనలో భాగంగా ముదోల్, ఆర్మూరు, కోరుట్లలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. మంత్రి వేముల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు…
తెలంగాణ ప్రభుత్వంపై ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ విమర్శలు గుప్పించారు. ఏసీడీపీ నిధులు ఆపారు.. అభివృద్ది ఆపడం ఏంటీ అంటూ ఆమె ప్రశ్నించారు. దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, రోడ్ల పనులు ఆపారు.. నిధులు రాకుండా నిలిపి వేశారు అని ఎమ్మెల్యే అడిగారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామితో నిర్మల్ మాస్టర్ ప్లాన్ పై రైతులు తమ దీక్ష విరమించారు. ఆర్డీవో కార్యాలయం ముందు రైతుల దీక్ష శిబిరాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. మాస్టర్ ప్లాన్ పై మంత్రి ఎలాంటి ఆందోళన చెందవద్దు.. ఇది కేవలం డ్రాప్ట్ నోటిఫికేషన్ మాత్రమే.. ఇది ఫైనల్ మాస్టర్ ప్లాన్ కాదనేది ప్రజలు గమనించాలని ఆయన అన్నారు.
Alleti Maheshwar Reddy: మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ నిర్మల్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఐదు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం తెల్లవారుజామున ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
కడెం ప్రాజెక్టు పరిస్థితి అయితే డేంజర్ జోన్‌లోకి వెళ్లింది. ప్రాజెక్టుకు ఏకంగా 3 లక్షల క్యూసెక్కులకు చేరువలో ఇన్ ఫ్లో వస్తోంది. కడెం ప్రాజెక్టు అసలు సామర్థ్యం 3. 50 లక్షల క్యూసెక్కులుగా కాగా.. ప్రాజెక్టుకు ఇంకా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులోని 16 గేట్లను అధికారులు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. అయితే మరో రెండు గేట్లు మాత్రం మొరాయించాయి.
Kadem project: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్‌లో ఉంది. వరద ఉధృతి పెరగడంతో ఇన్ ఫ్లో పెరిగింది. సామర్థ్యానికి మించి నీరు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Indrakaran Reddy: నిర్మల్ జిల్లా కేంద్రంలో విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. మన ఊరు-మన బడి’ పాఠశాల, నూతనంగా నిర్మించిన రాంనగర్, సోఫినగర్ పాఠాశాలను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
IIIT Student: బాసర ట్రిపుల్ ఐటీలో దీపిక అనే విద్యార్థిని మృతి చెందిన ఘటన మరవకముందే మరో విద్యార్థిని లిఖిత మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది. ట్రిపుల్ ఐటీ లోనే విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.