Shivaraj Yogi : మహాశివరాత్రి హిందూమతంలోని అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటి. ఈ పండుగను దేశవ్యాప్తంగా, ఇంకా ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులు ఎంతో భక్తి, శ్రద్ధతో జరుపుకుంటారు. సాధారణంగా ఫాల్గుణ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి తిథిని మహాశివరాత్రిగా పాటిస్తారు. ఈ రోజు శివభక్తులకు విశేష ప్రాముఖ్యత కలిగి ఉండటమే కాకుండా, ఆధ్యాత్మికమైన విలువలు నిండిన రోజుగా భావించబడుతుంది. అయితే.. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్‌కు చెందిన మహదేవ్ శక్తి సంస్థాన్, రాజశ్యామల పీఠం ఆధ్వర్యంలో కోటి రుద్రాక్ష ప్రసాదం కార్యక్రమాన్ని సద్గురుదేవులు శివరాజయోగి కృష్ణస్వామీజీ వారిచే అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.