DCCB Director Kidnap: నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ పరిధిలో పొనకల్ గ్రామంలో జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. బాధితుడు చిక్యాల హరీష్ కుమార్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించి ఇంట్లోకి చొరబడి బంగారం, నగదుతో పాటు వాహనం దొంగలించిన కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిళ మాట్లాడుతూ.. మామడ మండలం పోన్కల్ గ్రామంలో జరిగిన కిడ్నాప్ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. డీసీసీబీ డైరెక్టర్ హరీశ్ కుమార్ ను కిడ్నాప్ చేసి 3 కోట్ల రూపాయలను ఆ ముఠా డిమాండ్ చేసిందని అన్నారు. అయితే, సూత్రదారి బాధితుడి పాత కారు డ్రైవర్ హైదర్ గా తేలిందని ఎస్పీ చెప్పుకొచ్చారు.
Read Also: Air India: బ్రేకింగ్ న్యూస్.. ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీ కొట్టిన పక్షి..
ఇక, డీసీసీబీ డైరెక్టర్ హరీశ్ కుమార్ ను కిడ్నాప్ చేసేందుకు రెండు సార్లు రెక్కీ నిర్వహించినట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిళ వెల్లడించింది. అయితే, ఈ నెల 15వ తేదన ఒంటరిగా ఇంట్లో ఉండగా ఇంటిపై కప్పు భాగం నుంచి చొరబడిన కిడ్నాపర్లు.. ఇంట్లో నగలు, నగదు చోరీ చేసి కత్తులతో అతడ్ని బెదిరించినట్లు తెలిపింది. డైమండ్ ఉంగరం, బంగారం చైన్, రెండు తులాల గోల్డ్ బిళ్ళలతో పాటు రూ.5 వేల నగదు అపహరణ చేసినట్లు విచారణలో తేలిందన్నారు. కాగా, కిడ్నాప్ చేసి తన కారులో తీసుకొని వెళ్తుండగా మనోహర బాద్ టోల్ ప్లాజా దగ్గర తప్పించుకున్న బాధితుడు.. అయితే, ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా వారి దగ్గర నుంచి బంగారు చైన్, బాధితుడి పర్సు, రూ. 2 వేల నగదుతో పాటు 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ షర్మిళ చెప్పుకొచ్చింది.