Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధం అయింది. ఆర్జీయూకేటీ బాసర ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రాం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల తేదీ ఖరారు అయింది. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ), బాసర్ – 2025-26 విద్యా సంవత్సరానికి గాను 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను 28.05.2025న విడుదల చేయనున్నట్లు అధికారుల వెల్లడించారు.
Read Also: India China: చైనా దొంగ బుద్ధి.. ఐదుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఆంక్షలకు మోకాలడ్డు..
అయితే, ప్రవేశాల షెడ్యూల్ త్వరలో విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పొందుపరచబడుతుంది. వివరాలకు, తాజా సమాచారం కోసం విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ను www.rgukt.ac.in సందర్శించగలరని యూనివర్సిటీ ఓ ప్రకటనను విడుదల చేసింది.