Nimisha Priya Case: కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియా యెమెన్ దేశంలో ఉరికంబం ఎక్కబోతున్నారు. ఆ దేశస్తుడైన తలాల్ అబ్దో మహదీని 2017లో హత్య చేసిన కారణంగా ఆమెను అక్కడి చట్టాల ప్రకారం ఉరిశిక్ష విధించబడింది. జూలై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. అయితే, ప్రస్తుతం నిమిషా ప్రియా కేసు భారత సుప్రీంకోర్టుకు చేరింది. ఉరిశిక్షకు రెండు రోజుల ముందు అంటే, జూలై 14న అత్యవసరంగా పిటిషన్‌ను విచారించనుంది.
Nimisha Priya: యెమెన్ దేశంలో కేరళకు చెందిన నర్సు ఉరికంబం ఎక్కేందుకు సిద్ధమైంది. 2017లో ఆ దేశ జాగీయుడైన తలాల్ అబ్దో మెహదీని హత్య చేసిన కారణంగా జూలై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. 36 ఏళ్ల నిమిషాకు 2020లో అక్కడి న్యాయవ్యవస్థ మరణశిక్షను విధించింది. అయితే, నిమిషాను కాపాడేందుకు ససేవ్ నిమిషా ప్రియ యాక్షన్ కౌన్సిల్ అధికారులు, యెమెన్ అధికారులు బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది.
యెమెన్ జాతీయుడి హత్య కేసులో ఉరిశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషా ప్రియకు వచ్చే వారం జూలై 16న ఉరిశిక్ష అమలు చేయనున్నారు. గత సంవత్సరం, కేరళకు చెందిన నిమిషా ప్రియకు యెమెన్ అధ్యక్షుడు మరణశిక్షను ఆమోదించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, ఆమె కుటుంబ సభ్యులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. సాధ్యమైన అన్ని సహాయాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఉరిశిక్ష పడిన…
Nimisha Priya case: హత్య ఆరోపణలపై యెమెన్ దేశంలో మరణశిక్ష విధించబడిన భారతీయ మహిళ నిమిషా ప్రియ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ‘‘ మానవతా కారణాల’’ దృష్ట్యా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉణ్నట్లు ఇరాన్ సీనియర్ అధికారి గురువారం తెలిపారు.
Nurse Nimisha Priya: యెమెన్‌లో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ (36)కు మరణశిక్ష విధించిన విషయం కలకలం రేపుతోంది. యెమెన్ జాతీయుడి హత్య కేసులో నిమిష ప్రియ దోషిగా తేల్చబడగా, ఇటీవలే యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఆమె మరణశిక్షను ధృవీకరించారు. ఈ శిక్షను నెల రోజుల లోపు అమలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై భారత విదేశాంగశాఖ స్పందించింది. నిమిష ప్రియ కేసు తమ దృష్టికి వచ్చినట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి…
Blood Money: కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్ కోర్టు మరణశిక్ష విధించింది. యెమెన్ దేశ పౌరుడిని హత్య చేసిన కేసులో 2017లో ఆమెకు శిక్ష విధించింది. అక్కడి సుప్రీంకోర్టు కూడా ఆమె చేసుకున్న అప్పీల్‌ని తిరస్కరించింది. అయితే ఇండియాలో ఉన్న ఆమె తల్లి మాత్రం కూతురు ప్రాణాల కోసం పోరాడుతోంది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో తాను యెమెన్ వెళ్లేందుకు అవకాశం కల్పించాలని ఈ ఏడాది ప్రారంభంలో ప్రియ తల్లి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నిర్ణయం…
Kerala Nurse: దేశం కాని దేశంలో కేరళకు చెందిన నర్సుకు మరణశిక్ష పడింది. యెమెన్ దేశంలో అక్కడి పౌరుడిని హత్య చేసిన కేసులో 2017లో భారత్‌కి చెందిన నిమిషా ప్రియకు మరణశిక్ష విధించబడింది. అయితే తాజాగా మరణశిక్ష అప్పీల్‌ని అక్కడి సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో మరణశిక్ష ఖాయంగా కనిపిస్తోంది. ప్రియా తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తికి మత్తుమందు ఇచ్చి హత్య చేసింది. ఈ కేసులో దోషిగా నిర్థారించడంతో మరణశిక్ష విధించబడింది. చివరి అవకాశంగా ఉన్న అభ్యర్థనను…