Nurse Nimisha Priya: యెమెన్‌లో నిమిష ప్రియకు మరణశిక్ష.. అధికారులతో భారత ప్రభుత్వం చర్చలు
- యెమెన్‌లో నిమిష ప్రియకు మరణశిక్ష..
- అధికారులతో భారత ప్రభుత్వం చర్చలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nurse Nimisha Priya: యెమెన్‌లో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ (36)కు మరణశిక్ష విధించిన విషయం కలకలం రేపుతోంది. యెమెన్ జాతీయుడి హత్య కేసులో నిమిష ప్రియ దోషిగా తేల్చబడగా, ఇటీవలే యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఆమె మరణశిక్షను ధృవీకరించారు. ఈ శిక్షను నెల రోజుల లోపు అమలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై భారత విదేశాంగశాఖ స్పందించింది. నిమిష ప్రియ కేసు తమ దృష్టికి వచ్చినట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం యత్నిస్తోందని పేర్కొన్నారు.
Also Read: Traffic Rules In Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. అతి చేసారో..?
Also Read
- Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
- PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
- Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
- How to Choose Sweet Apples: యాపిల్ కొనేటప్పుడు రంగు చూసి మోసపోవద్దు.. తియ్యటి పండు కోసం సింపుల్ చిట్కాలు
2017లో జరిగిన యెమెన్ జాతీయుడు అబ్దో మెహదీ హత్య కేసులో నిమిష ప్రియను అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం ఆమెను దోషిగా తేల్చిన కోర్టు మరణశిక్ష విధించింది. ఈ నిర్ణయంపై నిమిష ప్రియ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినా, దాన్ని తిరస్కరించారు. చివరగా, యెమెన్ అధ్యక్షుడు మరణశిక్షను ధృవీకరించడంతో నిమిష ప్రియ పరిస్థితి దారుణంగా తయారైంది. నిమిష ప్రియను శిక్ష నుంచి కాపాడే శక్తి ఇప్పుడు హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యుల చేతిలోనే ఉంది. వారు క్షమాభిక్ష పెడితేనే ఈ శిక్ష నుంచి ఆమె బయటపడగలదు. ఈ విషయాన్ని గ్రహించిన నిమిష తల్లి ప్రేమకుమారి యెమెన్‌కు వెళ్లి, అక్కడి గిరిజన నేతలను సంప్రదించి క్షమాభిక్ష కోరే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అధ్యక్షుడి నిర్ణయం ఆమె కృషిని వృథా చేయడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది.
Also Read: Parliament scuffle: ఆ రోజు రాహుల్ గాంధీ ఒక ఎంపీలా కాకుండా బౌన్సర్‌లా ప్రవర్తించారు..
నిమిష ప్రియ మరణశిక్ష రద్దు చేయించేందుకు భారత ప్రభుత్వం యెమెన్ అధికారులతో చర్చలు జరుపుతోంది. నిమిష కుటుంబ సభ్యులు ఆమెకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. ఈ ఘటన భారతీయుల మనోభావాలను కలిచివేసింది. నిమిష ప్రియకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం, యెమెన్ అధికారులను పలువురు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
-
Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
-
How to Choose Sweet Apples: యాపిల్ కొనేటప్పుడు రంగు చూసి మోసపోవద్దు.. తియ్యటి పండు కోసం సింపుల్ చిట్కాలు
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!