Crying Record: ఏడుపు రికార్డే.. తీరా చూస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crying Record: అగ్గిపుల్ల.. సబ్బు బిళ్ల.. కాదేది కవితకనర్హం అని మహాకవి శ్రీరంగ శ్రీనివాసరావు(శ్రీశ్రీ) అన్నారు. ఇపుడు .. కాదేది ప్రపంచ రికార్డుకు అనర్హం అంటున్నారు యువత. దేని మీద అయినా ప్రపంచ రికార్డు నెలకొల్పవచ్చని.. అలా ప్రతి ఒక్కదానిపై ప్రపంచ రికార్డు చేయడానికి యువత ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వాటిలో ఒకటి ఏడుపు. అదేంటీ ఏడుపు మీద ప్రపంచ రికార్డు ఏంటనీ అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. సాధారణంగా మనిషి సంతోషం వస్తే నవుతారు.. బాధలు వస్తే ఏడుస్తున్నారు.. ఇంకా తీరని బాధలు ఉంటే కుమిలి కుమిలి ఏడుస్తుంటారు. ఏడుపు అనకుంటే వచ్చేది కాదు. దానంత అది రాదు. కానీ ఒక వ్యక్తి కావాలని ఏడుస్తూ ప్రపంచ రికార్డు సాధించాలని భావించాడు. ఇప్పటి వరకు ఎవరు ఏడవనంత సేపు ఏడ్చి గిన్నీస్ వరల్డ్ రికార్డు నెలకొల్పాలని భావించాడు. భావించడమే కాదు.. ఆచరణలో పెట్టాడు. అయితే అతను రికార్డు సాధించలేదు.. కానీ తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు.. ఆ ఏడుపు రికార్డు ఏమిటీ.. ఆ కథంటే తెలుసుకుందాం..
Read also: Rohit Sharma: ఎంఎస్ ధోనీని అధిగమించిన రోహిత్ శర్మ!
Also Read
- Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
- Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు గురించి విని ఉంటారు. వింతవింత రికార్డులను కూడా చూసి ఉంటారు. కానీ ఏడుస్తూ రికార్డు చేయొచ్చు అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు అలాంటి వింత ఆలోచన.. కూడా చేస్తారా అనిపిస్తోంది కదా!. ఔను ఓ వ్యక్తి ఇలాంటి వెరైటీ రికార్డును నెలకొల్పాలనుకున్నాడు. వినూత్న రీతిలో ప్రపంచ రికార్డును సృష్టించాలని నిశ్చయించకున్నాడు. అందుకోసం నాన్‌స్టాప్‌గా ఏడవాలనే ఒక విచిత్రమైన టాస్క్ తీసుకున్నాడు. నైజీరియాకి చెందిన టెంబు ఎబెరే అనే వ్యక్తి ఎలాగైన ప్రపంచ రికార్డును బద్దలుగొట్టాలనే ఉద్దేశంతో నాన్‌స్టాప్‌గా ఏడవడం అనే ఫీట్‌ని ఎంచుకున్నాడు. రికార్డు బ్రేక్ చేయడం కోసం ఏకంగా ఏడు రోజుల పాటు నాన్‌స్టాప్‌గా ఏడ్చాడు. దీంతో అతడు 45 నిమషాల పాటు చూపుని కోల్పోయాడు. అతను అంతలా కంటిన్యూగా ఏడవడం కారణంగా తలనొప్పి, ముఖం వాచిపోవడం, కళ్లు ఉబ్బడం వంటి శారరీక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అనారోగ్య సమస్య రావడంతో తాను తన ఏడుపును కొనసాగించలేక పోతున్నట్టు ప్రకటించాడు. ఎబెరే గిన్నీస్ వరల్డ్ రికార్డుకి దరఖాస్తు చేయకపోవడంతో దానిని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వారు అతను ఏడ్చిన సమయాన్ని లెక్కలోకి తీసుకోలేదు. వరల్డ్ రికార్డులు చేయడం నైజీరియన్లకు కొత్తేమీ కాదు. కొద్ది నెలల క్రితం ఒక నైజీరియన్ మహిళ 100 గంటల పాలు కంటిన్యూగా వంటలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. మేలో హిల్డా బాసి అనే చెఫ్ నైజీరియన్ వంటకాలకు పేరు తేవడానికి… 100 గంటలపాటు నిరంతరం వంట చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డును సాధించింది.
తాజావార్తలు
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్‌సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?