వన్డే ప్రపంచకప్ 2023లో లీగ్ మ్యాచ్ లు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే సెమీస్ బెర్త్ ను టీమిండియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు చేరుకోగా.. ఫోర్త్ ప్లేస్ కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో న్యూజిలాండ్ తమ కీలక మ్యాచ్ ను ఇవాళ శ్రీలంకతో ఆడుతుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో మధ్యాహ్నం 2గంటలకు స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిస్తే సెమీస్ కు వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక, ఓడిపోతే సెమీస్ అవకాశాలు మరింత కష్టంగా మారుతాయి. దీంతో ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలిచేందుకు కీవిస్ చూస్తుంది.
Read Also: Swadesh Store: మొదటి ‘స్వదేశ్’ స్టోర్‌ను తెరిచిన రిలయన్స్ రిటైల్
అయితే, న్యూజిలాండ్- శ్రీలంక టీమ్స్ మధ్య ఇప్పటి వరకు మొత్తం 101 వన్డే మ్యాచ్ లు ఆడాయి. ఇందులో న్యూజిలాండ్ 51 మ్యాచుల్లో గెలిచి ముందంజలో ఉండగా.. శ్రీలంక 44 మ్యాచ్ లలో విజయాలు నమోదు చేసింది. ఎనిమిది మ్యాచ్ లు ఫలితం తేలలేదు.. ఇక ఒక మ్యాచ్ డ్రాగా అయింది. మరోవైపు వరల్డ్ కప్ చరిత్రలో ఇరు జట్లు 11సార్లు పోటీ పడ్డాయి. ఇందులో శ్రీలంక ఆరుసార్లు గెలవగా.. న్యూజిలాండ్ ఐదు సార్లు విజయం సాధించింది. ఈ టోర్నమెంట్లో తొలుత వరుసగా నాలుగు విజయాలతో దూసుకుపోయిన కివీస్ ఆ తరువాత నాలుగు మ్యాచ్ లలో వరుసగా ఓటమిపాలైంది. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్ లో సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే న్యూజిలాండ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. దీంతో ఈ మ్యాచ్ లో కివీస్ ఏ మేరకు రాణిస్తుందోనని క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
Read Also: Bhatti Vikramarka: నేడు భట్టి విక్రమార్క నామినేషన్.. జనసంద్రంగా మారిన మధిర
ఇక, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్- శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. దీంతో కీవిస్ జట్లుకు వర్షం భయం పట్టుకుంది. ఇదే మైదానంలో న్యూజిలాండ్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది.. కివీస్ 401 రన్స్ చేసింది.. వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్దతిలో ఆ మ్యాచ్ లో పాకిస్థాన్ ను విజేతగా అంపైర్లు ప్రకటించారు. ఇక, అదే గ్రౌండ్ లో నేడు న్యూజిలాండ్- శ్రీలంక మ్యాచ్ కు 80 శాతం వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ వర్షంతో మ్యాచ్ నిలిచిపోతే కీవీస్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ డ్రా అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కివీస్ సెమీస్ ఆశలు గల్లంతు అయ్యే అవకాశం ఉంది. అయితే, చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచిన టీమ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది.