17 ఏళ్ళ కెరీర్… 7 సినిమాలు. వాటిలో రెండు కన్నడ చిత్రాలు. తెలుగులో ఐదు సినిమాలు. కన్నడలో రెండు సినిమాలు బాగా ఆడినవే. అయితే తెలుగులో తీసిన ఐదు సినిమాలూ ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. ఈ ఉపోద్ఘాతం అంతా దర్శకుడు మెహర్ రమేశ్ గురించే. దాదాపు 9 సంవత్సరాల తర్వాత మెహర్ మళ్ళీ మెగా ఫోన్ పట్టాడు. ఈ సారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా గురువారం హైదరాబాద్ లో ఆరంభం అయింది.…
ప్రస్తుతం అందరి చూపు ఓటిటీల మీదే పడింది. ఎంచక్కా ఇంటి దగ్గరే కూర్చొని కుటుంబంతో కలిసి సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఇకప్రేక్షకుల అభిరుచి మేరకు స్టార్స్ సైతం ఓటిటీకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోహీరోయిన్లందరు ఓటిటీకి పరిచయమయ్యారు. సమంత ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ తో హిట్ అందుకొంది. ఇక సామ్ బాటలోనే చైతూ సైతం ఓటిటీ బాట పట్టాడు. ఇటీవల లవ్ స్టోరీ తో హిట్ అందుకున్న చైతన్య ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్ట్ లతో…
సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఛలో ప్రేమిద్దాం’. సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. తాజాగా భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ను ఈ రోజు నటుడు జగపతి బాబు లాంచ్ చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎమ్‌బిఏ, ఎమ్‌సిఏలు చదవలేకపోతివి` అంటూ…
ఆ మధ్య కుడిచేతి మణికట్టుకు సర్జరీ చేయించుకున్న మెగాస్టార్ చిరంజీవి, కొద్ది రోజుల పాటు చేతికి రెస్ట్ ఇచ్చి ఇప్పుడు రఫ్ఫాడించడం మొదలెట్టేశారు. చేయినొప్పి కారణంగా ‘లూసీఫర్’ రీమేక్ షూటింగ్ కు కాస్తంత విరామం ప్రకటించిన చిరంజీవి, తిరిగి ఆ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. అంతేకాదు… ఇప్పుడు మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించబోతున్న సినిమా పూజా కార్యక్రమాలకూ ముహూర్తం ఫిక్స్ చేసేశారు. కె. ఎస్. రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ నవంబర్ 6వ…
‘వలయం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న లక్ష్ చదలవాడ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’. యంగ్ డైరెక్టర్ ఇషాన్ సూర్య తో ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ, ”డిఫరెంట్ కథాంశంతో కమర్షియల్ హంగులతో రూపొందుతున్న ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, అలాగే సంగీత దర్శకుడు సాయి కార్తీక్ సమకూర్చిన పాటలకు ప్రేక్షకుల నుండి…
గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్, ధృవిక జంటగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ నిర్మిస్తున్న చిత్రం ‘భగత్ సింగ్ నగర్’. తెలుగు, తమిళ బాషలలో రూపొందిన ఈ సినిమా టీజర్ ప్రకాష్ రాజ్ విడుదల చేశారు. ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి లిరికల్ సాంగ్ ‘చరిత చూపని’ మిలియన్ వ్యూస్ సాధించటం పట్ల ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు దర్శకనిర్మాతలు. త్వరలో మిగిలిన పాటలను విడుదల చేసి సినిమాను కూడా…
అబ్రార్ ఖాన్, ఐశ్వర్య జంటగా రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో ఏ. యమ్. ఖాన్ నిర్మిస్తున్న చిత్రం ‘ఓ మధు’. శుక్రవారం ఈ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా దర్శక నిర్మాతలు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ సునీత లక్ష్మారెడ్డి ‘ఓ మధు’ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఆమెతో పాటే మాజీ ఎమ్మెల్యే నగేష్, నిర్మాత సత్యారెడ్డి, అడిషినల్ యస్.పి. లక్ష్మణ్ తదితర…
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘భాగ్ సాలే’. ఈ మూవీ షూటింగ్ ప్రారంభోత్సవం సోమవారం ఉదయం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు హరీష్ శంకర్ ఫస్ట్ షాట్ కు క్లాప్ కొట్టారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేష్ బాబు సమర్పణలో బిగ్ బెన్ సినిమా, సినీ వ్యాలీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.…
జెమిని ప్రొడక్షన్ సంస్థ యువ ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో కంటెంట్ బేస్డ్ సినిమాలను రూపొందించడానికి సిద్ధమైంది. అందులో భాగంగా సరికొత్త కథాంశాలకు ప్రాధాన్యమిస్తూ సినిమాలు నిర్మిస్తోంది. తాజాగా ఆ సంస్థ సహకారంతో గుడాల నవీన్ ‘రేంజ్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న ఈ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ లో యంగ్ హీరో చైతన్య వంశీ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. హేమంత్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బుధవారం ఈ సినిమా పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది.…
చియాన్ విక్రమ్ నటిస్తున్న 60వ చిత్రానికి ‘మహాన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను, మేకింగ్ వీడియోను సోషల్ మీడియా ద్వారా విక్రమ్ అభిమానులకు అందించారు. విక్రమ్ తనయుడు ధ్రువ్ సైతం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ధ్రువ్ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంటే, గ్యాంగ్ స్టర్ గా డిఫరెంట్ గెటప్ లో విక్రమ్ దర్శనం ఇవ్వబోతున్నాడు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్…