ప్రస్తుతం అందరి చూపు ఓటిటీల మీదే పడింది. ఎంచక్కా ఇంటి దగ్గరే కూర్చొని కుటుంబంతో కలిసి సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఇకప్రేక్షకుల అభిరుచి మేరకు స్టార్స్ సైతం ఓటిటీకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోహీరోయిన్లందరు ఓటిటీకి పరిచయమయ్యారు. సమంత ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ తో హిట్ అందుకొంది. ఇక సామ్ బాటలోనే చైతూ సైతం ఓటిటీ బాట పట్టాడు. ఇటీవల లవ్ స్టోరీ తో హిట్ అందుకున్న చైతన్య ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ఓటిటీ కోసమని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఇటీవల చైతూ ఈ వార్తలపై స్పందిస్తూ ” ఒక హర్రర్ కథాంశంతో వస్తున్న చిత్రంలో విలన్ గా నటిస్తున్నాను. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర, అందులోను హర్రర్ కధాంశం అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని.. ఈ విషయం తెలిసి చాలామంది ఆశ్చర్యపోయారు కూడా.. కానీ, పాత్ర నచ్చడంతో దీనికి ఒప్పుకున్నాను. అమెజాన్ ప్రైమ్ కోసం చేస్తున్న ఈ సిరీస్‌కు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది” అని చెప్పుకొచ్చాడు. అయితే చైతూ కు మొదటి నుంచి హర్రర్ కథలంటే భయమని, ఆ భయంతోనే సమంత, నాగార్జున నటించిన ‘రాజుగారి గది 2’ కూడా చూడలేదని అప్పట్లో సామ్ తెలిపింది. మరి ఇప్పుడు ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి చైతూ ప్రయత్నిస్తున్నాడా..? లేక తనలో కొత్త మార్పులు వచ్చాయని తెలుపుతున్నాడా ..? అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా ఈ విషయంలో మాత్రం చై, సామ్ ని ఫాలో అవుతున్నాడన్న మాట మాత్రం వాస్తవమే అని తెలుస్తోంది.