సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఛలో ప్రేమిద్దాం’. సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. తాజాగా భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ను ఈ రోజు నటుడు జగపతి బాబు లాంచ్ చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎమ్‌బిఏ, ఎమ్‌సిఏలు చదవలేకపోతివి` అంటూ సాగే ఈ కాలేజ్ సాంగ్ కు దేవ్ పవార్ సాహిత్యాన్ని సమకూర్చగా వెంకట్ దీప్ కొరియోగ్రఫీ అందించారు.
డైరక్టర్ సురేష్ శేఖర్ రేపల్లే మాట్లాడుతూ… ”ఇవాళ విడుదలైన కాలేజ్ సాంగ్ యూత్ తో పాటు ప్రతి ఒక్కకరికీ కనెక్టయ్యే విధంగా ఉంటుంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలైన మా సాంగ్ అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది. వరుసగా ఒక్కో సింగిల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం. అతి త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం” అని అన్నారు. జగపతిబాబు తొలి గీతాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉందని హీరో సాయి రోనక్ తెలిపారు. చిత్ర దర్శకుడు సురేశ్ తనకు మంచి మిత్రుడని, ఇందులో ప్రాధాన్యమున్న ఓ మంచి పాత్రను తనకు ఇచ్చాడని నటుడు ఆర్.కె. చెప్పాడు.