Nepal Squad for Asia Cup 2023: ఆసియా కప్‌కు నేపాల్ జట్టు తొలిసారి అర్హత సాధించిన విషయం తెలిసిందే. 2023 ఆసియా కప్ కోసం నేపాల్ తమ 17 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఐపీఎల్ స్టార్, స్పిన్నర్ సందీప్ లామిచానే జట్టులో చోటు దక్కించుకున్నాడు. నేపాల్ జట్టుకు కెప్టెన్‌గా యువ ఆటగాడు రోహిత్ పాడెల్ ఎంపికయ్యాడు. నాయకత్వ నైపుణ్యాలు మరియు అసాధారణమైన ప్రతిభ కారణంగానే రోహిత్ నేపాల్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. నేపాల్ జట్టులో…
నేపాల్ నుంచి టమాటా లోడుతో వస్తున్న వ్యాన్ నిన్న (ఆదివారం) ఉదయం 5 గంటల సమయంలో బీహార్ లోని రాంచీ-పాట్నా హైవే పైన వస్తుండగా డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో చర్హివ్యాలీ దగ్గర వ్యాన్ బోల్తా పడింది. దీంతో వ్యాన్ లోని టమాటాలు రోడ్ పైన పడిపోయాయి.. అది గమనించిన స్థానికులు దొరికిందే అవకాశంగా టమాటాలను ఎవరికీ నచ్చినట్లు వాళ్ళు తీసుకెళ్లారు.
Secunderabad: సికింద్రాబాద్ సింధీ కాలనీలో ఈ నెల 9న జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు విచారించారు. ఒక వ్యాపారి ఇంట్లో రూ. 5 కోట్ల సొత్తు చోరీ.. ఈ కేసులో 9 మందిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం దేశంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి.. అందులో టమోటా ధరలు బంగారం తో పోటి పడుతూ.. రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయి.. ఈ మేరకు టమోటాల దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్న బెంగుళూరు లో పొలంలో 2 వేల కేజిల టమోటాలను దొంగతనం జరిగిన ఘటన మరవ ముందే ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. నేపాల్ నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తున్న 3 టన్నుల టమోటాలను కస్టమ్స్ అధికారులు విడుదల చేసిన పరిస్థితులపై విచారణకు…
ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలతోపాటు.. హెలికాప్టర్ ప్రమాదాలు కూడా అక్కడక్కడా జరుగుతున్నాయి. ఈ మధ్య జరిగిన విమాన ప్రమాదాల్లో మరణాలు సంభవించకపోయినప్పటికీ.. గాయాలపాలవుతున్న వారు ఉంటున్నారు.
నేపాల్‌లోని సోలుకుంబు నుంచి ఖాట్మండుకు ప్రయాణిస్తున్న సమయంలో ఐదుగురు విదేశీ పౌరులతో సహా ఆరుగురితో కూడిన హెలికాప్టర్ ఈ రోజు అదృశ్యమైంది. 9ఎన్ఎండబ్ల్యూ కాల్ గుర్తుతో ఉన్న ఛాపర్ ఉదయం 10:15 గంటలకు కంట్రోల్ టవర్‌తో సంబంధాన్ని కోల్పోయింది.
PUBG Love Story: పబ్జీ లవ్ స్టోరీ దేశవ్యాప్తంగా వైరల్ గా మారిన సంతతి తెలిసిందే. పాకిస్తాన్ కి చెందిన మహిళ, ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన వ్యక్తితో ప్రేమలో పడింది. కరోనా సమయంలో పబ్జీ గేమ్ ద్వారా ఇద్దరూ మొదటగా పరిచయమయ్యారు. ఆ తరువాత వీరిద్దరు ప్రేమలో పడ్డారు. తన ప్రియుడిని కలుసుకునేందుకు ఆమె భారతదేశానికి వచ్చింది. అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలు ఉన్న సీమా హైదర్ సౌదీ అరేబియా, నేపాల్ మీదుగా ఇండియా చేరింది.…
Nepal: భారతదేశ వ్యాపారవేత్త తనను ప్రధాని చేయడానికి ప్రయత్నాలు చేశారంటూ నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో అగ్గిరాజేశాయి. ప్రధాని వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. కొందరు ప్రజాప్రతినిధులు నేపాల్ రాజకీయాల్లో భారత్ కలుగజేసుకోవడంపై విమర్శలు గుప్పించారు.
Nepal: నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్(ప్రచండ) చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే నేపాల్ రాజకీయాలు అస్థిరంగా ఉన్నాయి. తాజాగా పీఎం దహల్ చేసిన వ్యాఖ్యలు అక్కడ అగ్గిని రాజేశాయి