Nepal Squad for Asia Cup 2023: ఆసియా కప్‌కు నేపాల్ జట్టు తొలిసారి అర్హత సాధించిన విషయం తెలిసిందే. 2023 ఆసియా కప్ కోసం నేపాల్ తమ 17 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఐపీఎల్ స్టార్, స్పిన్నర్ సందీప్ లామిచానే జట్టులో చోటు దక్కించుకున్నాడు. నేపాల్ జట్టుకు కెప్టెన్‌గా యువ ఆటగాడు రోహిత్ పాడెల్ ఎంపికయ్యాడు. నాయకత్వ నైపుణ్యాలు మరియు అసాధారణమైన ప్రతిభ కారణంగానే రోహిత్ నేపాల్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
నేపాల్ జట్టులో ఆసిఫ్ షేక్, కుసల్ భుర్టెల్ మరియు కుశాల్ మల్లా వంటి ప్రముఖ ఆటగాళ్లు ఉన్నారు. వీరు నేపాల్ బ్యాటింగ్ భారంను మోయనున్నారు. బౌలింగ్ విభాగంలో సందీప్ లామిచానే, కరణ్ కేసీ మరియు సోంపాల్ కమీల ఉన్నారు. నేపాల్ జట్టు ఫీల్డింగ్ కూడా బాగా చేస్తుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఖాట్మండులో ఓ యువతిని బలవంతం చేశారనే ఆరోపణలపై లామిచానేపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో సస్పెండ్ అయ్యాడు. అతనికి బెయిల్ మంజూరు కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిషేధం ఎత్తివేయబడింది.
ఇటీవల శ్రీలంక వేదికగా జరిగిన ఎమర్జింగ్ ఆసియా కప్‌లో నేపాల్ రాణించలేదు. పాకిస్తాన్-ఏ, భారత్-ఏ జట్ల చేతిలో ఓటమి పాలైంది. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై మాత్రం అద్భుత విజయం సాధించింది. ఇక ఆసియా కప్ 2023లో నేపాల్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో తలపడనుంది. సెప్టెంబర్ 4న శ్రీలంకలోని క్యాండీలో భారత్‌తో ఆడుతుంది.
Also Read: Tuesday Remidies: అదృష్టం కలిసిరావడం లేదా?.. మంగళవారం నాడు ఈ చర్యలు చేస్తే డబ్బే డబ్బు!
ఆసియా కప్ 2023కు నేపాల్ జట్టు ఇదే:
రోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, కుసల్ భుర్టెల్, లలిత్ రాజ్‌బన్షి, భీమ్ షర్కీ, కుశాల్ మల్లా, డి.ఎస్. ఐరీ, సందీప్ లామిచానే, కరణ్ కె.సి., గుల్షన్ ఝా, ఆరిఫ్ షేక్, సోంపాల్ కమీ, కె. ప్రతీస్ జి.సి. మహతో, సందీప్ జోరా, అర్జున్ సౌద్, శ్యామ్ ధాకల్.