ఇప్పుడున్న రోజుల్లో చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి.. ఇతర దేశాలకు తరలించి అమ్మేస్తున్నారు కొందరు కిరాతకులు. తాజాగా ఒక పసికందుతో సహా ఇద్దరు నేపాలీ పిల్లలను కిడ్నాప్ చేసిన భారతీయుడిని (22) పోలీసులు అరెస్ట్ చేశారు. గోనె సంచులలో భారత్‌కు అక్రమ రవాణా చేసిన ఆరోపణలపై దక్షిణ నేపాల్‌లోని బారా జిల్లాలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
Read Also: Lucknow: స్వామి ప్రసాద్ మౌర్యపై బూటు విసిరిన యువకుడు.. చితకబాదినన కార్యకర్తలు
వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన తబ్రేజ్ ఆలం అనే వ్యక్తి ఆదివారం నాడు తొమ్మిది నెలల పాప, రెండేళ్ల బాలుడిని తీసుకెళ్తుండగా సాయుధ పోలీసు బలగాలు పట్టుకున్నట్లు ఆర్మ్‌డ్ పోలీస్ సీనియర్ సూపరింటెండెంట్ రాజేంద్ర ఖడ్కా తెలిపారు. పిల్లలను గోనె సంచులలో నేపాల్-భారత్ సరిహద్దు వెంబడి దేవతాల్ రూరల్ మునిసిపాలిటీ నుండి భారతదేశానికి తీసుకువెళుతున్నాడని ఖడ్కా చెప్పారు.
Read Also: Fire Accident: పశ్చిమ ఢిల్లీలోని ఓ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
అమ్వా గ్రామంలో ఇద్దరు పిల్లలు కిడ్నాప్ కు గురై అయ్యారన్న సమాచారంపై తబ్రేజ్ ఆలంను అరెస్టు చేసినట్లు ఖడ్కా తెలిపారు. గోనె సంచిలో పిల్లల అరుపులు, కేకలు విన్న పారామిలటరీ సంస్థకు చెందిన బృందం ఆలంను పట్టుకుని పిల్లలను రక్షించారు. అనంతరం పిల్లలను క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. జిల్లా పోలీసు కార్యాలయానికి తరలించారు. మరోవైపు తమ పిల్లలను రక్షించినందుకు తల్లిదండ్రులు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.