Sriharikota: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి.. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు సీఐఎస్‌ఏఫ్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోవడంతో.. అసలు షార్ సెంటర్‌లో ఏం జరుగుతోంది? అనే ఆందోళన మొదలైంది.. అయితే, ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. ఆత్మహత్యలపై విచారణ చేపట్టారు.. చెట్టుకు ఊరివేసుకుని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కానిస్టేబుల్ చింతామణి ఆత్మహత్య చేసుకున్నారు.. 29 ఏళ్ల చింతామణి 2021లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు.. శిక్షణానంతరం శ్రీహరికోటలోని యూనిట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.. నెలరోజుల పాటు దీర్ఘకాలిక సెలవుపై సొంతూరుకు వెళ్లి ఈ నెల 10న తిరిగి వచ్చిన చింతామణి.. నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Read Also: Astrology : జనవరి 17, మంగళవారం దినఫలాలు
ఇక, నిన్న సాయంత్రం షార్ మొదటి గేటువద్ద కంట్రోల్ రూమ్‌లో విధుల్లో ఉన్న బీహార్ కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ వికాస్ సింగ్.. గన్ తో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.. ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో సహచరుల్లో ఆందోళన మొదలైంది.. చింతామణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసిన స్వగ్రామానికి తరలించారు అధికారులు.. ఇవాళ ఉదయం పది గంటలకు వికాస్ సింగ్ మృతదేహానికి కూడా పోస్టుమార్టం నిర్వహించనున్నారు.. అయితే, ఈ ఇద్దరు ఒకేరోజు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి? వ్యక్తిగత సమస్యలా..? లేదా డ్యూటీపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలపై కూడా ఫోకస్ పెట్టారు పోలీసులు..