Kotam Reddy Sridhar Reddy: చిన్నారికి అండగా నిలిచిన వైసీపీ ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన మంచి మనసు చాటుకున్నారు. దీంతో ఆయనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. గుండె సమస్యతో ఆపదలో ఉన్న ఓ చిన్నారికి ఎమ్మెల్యే కోటంరెడ్డి అండగా నిలిచారు. ఉప్పుటూరు గ్రామంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇటీవల గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుండగా.. గిరిజన కుటుంబానికి చెందిన చిన్నారి స్నేహకు గుండె సమస్య ఉన్నట్లు ఆయన దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే స్పందించి కారు ఏర్పాటు చేసి తన ప్రతినిధిని పంపించి తిరుపతిలోని ఓ ఆస్పత్రికి చిన్నారిని తరలించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే కోటంరెడ్డి వైద్యులతో స్వయంగా మాట్లాడి ఆరోగ్యశ్రీ కింద చిన్నారికి ఆపరేషన్ పూర్తయ్యేలా చేశారు.
Read Also: YCP Vs TDP: CNOS ముఖ్యమంత్రుల పనితీరు ర్యాంకులపై మాటల యుద్ధం
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ఈ ఆపరేషన్ విజయవంతమై చిన్నారి కోలుకోవడంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సర్జరీ అనంతరం కోలుకున్న చిన్నారి తల్లిదండ్రులతో కలిసి మంగళవారం నాడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుంది. తన అండగా నిలిచిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి స్నేహ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. తమ ఇంటి పెద్దన్నలా ఆదుకున్న ఎమ్మెల్యేకు చిన్నారి కొత్త బట్టలు పెట్టి కృతజ్ఞతలు తెలియజేశారు. చిన్నారి స్నేహతో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆప్యాయంగా ముచ్చటించి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నారి స్నేహ కుటుంబానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!