CM Jagan: ఈనెల 27న నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan: ఏపీ సీఎం జగన్ ఈనెల 27న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో ఏపీ జెన్‌కో థర్మల్ పవర్ స్టేషన్‌లోని మూడో యూనిట్‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఇతర కీలక నేతలు హాజరు కానున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్‌లోని మూడో యూనిట్ పూర్తి సామర్థ్యం 800 మెగావాట్లు అని అధికారులు వెల్లడించారు. అయితే సీఎం జగన్ పర్యటనను అడ్డుకుంటామని వామపక్షాల నేతలు హెచ్చరిస్తున్నారు. జెన్‌కోను ప్రైవేటుపరం చేస్తున్నారన్న సమాచారం తమకు ఉందని ఆరోపిస్తున్నారు.
Read Also: Imran Khan: ఏడు చోట్ల పోటీ చేశాడు.. ఆరు చోట్ల గెలిచాడు..!!
Also Read
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
ఈ నెల 27న ముఖ్యమంత్రి జగన్ రాక సందర్భంగా ఏర్పాట్లను జెన్ కో ఎండీ శ్రీధర్ పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఆయన జెన్‌కో ప్రైవేటీకరణ అంశంపై స్పందించారు. థర్మల్ కేంద్రాన్ని, దాని ఆస్తులను ఎవరికీ అప్పగించడం లేదని స్పష్టం చేశారు. జెన్‌కో నిర్వహణ కంటే తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేయగలిగే అవకాశం కోసం ప్రైవేటు టెండర్లు పిలిచామన్నారు. కేవలం విద్యుత్ ఉత్పత్తి నిర్వహణను మాత్రమే ప్రైవేటు పరం చేస్తున్నట్లు చెప్పారు. కాగా ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టును 2015లో అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. 20వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఇందులో మొత్తం మూడు యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్ 800 మెగావాట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో తయారు చేశారు. ప్రస్తుతం రెండు యూనిట్లు పనిచేస్తున్నాయి. మూడో యూనిట్ పనులు కూడా పూర్తికాగా ప్రస్తుతం టెస్ట్ రన్ జరుగుతోంది. పరిశీలనలోనే 300 మెగావాట్లకుపైగా సామర్థ్యంతో మూడో యూనిట్ పనిచేస్తోంది.
తాజావార్తలు
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!