నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం అంతా టీడీపీ మయం అయిందని.. మండలంలో ఉన్న 24 పంచాయతీల నుండి శుక్రవారం వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారని ఉదయగిరి టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. వరికుంటపాడు మండలంలో శుక్రవారం ఆత్మీయ సమావేశం టీడీపీ మండల అధ్యక్షుడు చండ్రా మధుసూదన్ రావు ఆధ్వర్యంలో జరిగింది.
Bird Flu : ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా లేదా బర్డ్ ఫ్లూ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం వ్యాప్తి పక్షుల మధ్య మాత్రమే, సాధారణ ప్రజలలో ఇంకా వ్యాప్తి చెందలేదు.
నెల్లూరు జిల్లాలో కోళ్లకు వచ్చిన వ్యాధికి సంబంధించి ఏపీ పశు సంవర్ధక శాఖ ఓ ప్రకటన చేసింది. అక్కడ కోళ్లకు వచ్చిన వ్యాధి ఏవియన్ ఇన్ఫ్లుయాంజగా గుర్తించినట్లు తెలిపింది. భోపాల్లో ల్యాబ్ టెస్ట్ కి పంపించిన తర్వాత వ్యాధి నిర్ధారణ జరిగిందని పేర్కొ్న్నారు. కోళ్లు ఎక్కువగా ఉన్న ఉభయగోదావరి, కడప, అనంతపురం జిల్లాలకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాకుండా.. చెరువులు, వలస పక్షులు వచ్చే ఉభయగోదావరి జిల్లాలు, నెల్లూరు, కడప, అనంతపురం ప్రకాశం…
నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్ ప్లాజా దగ్గర శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును లారీ ఢీ కొట్టడంతో.. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్రవాయుగుండం తుఫాన్‌గా మారుతున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈనెల 4వ తేదీన నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావిత 8 జిల్లాలకు ముందస్తుగా ఏపీ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.
నెల్లూరు జిల్లా పెంచలకోన జలపాతం దగ్గర తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మొత్తం పదకొండు మంది యాత్రికులు గల్లంతయినట్లు సమాచారం. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. వరద ఉధృతికి పదకొండు మంది పర్యాటకులు కొట్టుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
నెల్లూరు జిల్లా కావలిలో ఆటోనగర్ డిపో ఆర్టీసీ డ్రైవర్ల పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి అని ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు డిమాండ్ చేశారు. నిరంతరం రాత్రి పగలు ప్రయాణీకుల రవాణా సౌకర్యాన్ని అందించేందుకు విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బందిపై ఈ మధ్య దాడులు పెరగడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు.