నెల్లూరు జిల్లాలో ఆస్తి కోసం కన్న తండ్రినే దారుణంగా హత్య చేశాడో వ్యక్తి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సైదాపురం మండలం మొలకల పూండ్లలో తండ్రిని కుమారుడు దారుణంగా హత మార్చిన ఘటన జరిగింది.. స్థానికంగా నివసించే పాలెపు వెంకటేశ్వర్లు... ఆయన కుమారుడైన శివాజీకి గత కొద్ది కాలంగా ఆస్తులకు సంబంధించి వివాదం జరుగుతోంది.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. వచ్చేనెల 6వ తేదీన ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం తమ్మిన పట్నం గ్రామానికి రానున్నారు.. కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెజ్ సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోడీ.
నెల్లూరు జిల్లాలోని నారాయణ వైద్య కళాశాలలో బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ భవనం పైనుంచి దూకి ప్రదీప్ సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది.
నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాల స్లాబ్ కూలిన ఘటనలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.. నెల్లూరు రూరల్ పరిధి బీవీ నగర్‌లోని కురుగొండ నాగిరెడ్డి నగరపాలక సంస్థ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.. పాఠశాలలో ఇటీవల అదనపు తరగతుల కోసం భవనాలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాణం సాగుతున్న ప్రాంతం వద్ద విద్యార్థులు ఆడుకుంటుండగా... ఒక్కసారిగా స్లాబ్ కింద పడిందని.. దీంతో 9వ తరగతి చదువుతున్న గురు మహేంద్ర అనే విద్యార్థి మృతి చెందినట్టు చెబుతున్నారు.
నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాన్ని రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణలతో కలిసి రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు.
నెల్లూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి ఉందని..పెద్ద పులి ఉండటం మనకు గర్వకారణమని జిల్లా అటవీ శాఖ అధికారి చంద్రశేఖర్ అన్నారు. పెద్ద పులిని అనుక్షణం పర్యవేక్షిస్తున్నామన్నారు.
ఆ తల్లి నవమాసాలు బిడ్డను కడుపులో మోసింది. పురుటి నొప్పులను భరించి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ ముక్కుపచ్చలారని పసికందు పుట్టిన కాసేపటికే చెరువులో విగతజీవిగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి సమీపంలోని చెరువులో పురిటి బిడ్డ మృతదేహం లభ్యమైంది.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కనిగిరి నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా.. 10 మందికి గాయాలయ్యాయి.
నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేయబోయి కారు వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.