ఏపీలో ఆలిండియా సర్వీస్ అధికారులు ఎక్కువగా రాజకీయ వివాదాల్లో చిక్కుకుంటున్నారన్న చర్చ జోరుగా జరుగుతోంది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో. ప్రభుత్వాలు మారినప్పుడు ఒకరిద్దరు ఐఎఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఇబ్బందులు పడటం, వివాదాల్లో ఇరుక్కోవడం గతంలో కూడా ఉన్నా... ఇప్పుడు అదే పెద్ద వ్యవహారంగా మారిపోవడం ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు.
ఈవీఎం మాయాజాలం తోడై కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు ఆర్కే రోజా.. కళ్ల బొల్లి మాటలు, వాగ్దానాలకు ప్రజలు నమ్మి ఓటు వేశారు, గెలిచాక మాటమార్చారని విమర్శించారు.. కుక్కతోక వంకర తరహాలో చంద్రబాబు ఎన్నికలు ముందు మారాను అని చెప్పి, అధికారంలోకి వచ్చాక మళ్లీ అదే విధంగా ఆలోచన చేస్తున్నారు అని దుయ్యబట్టారు
ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగి ఏడాది పూర్తయిపోయింది. ఈ టైంలో అమలైన హామీలు, జరిగిన పనుల గురించి విస్తృత చర్చ మొదలైంది రాష్ట్రంలో. ఆ చర్చ దిశగానే తెలుగుదేశం పార్టీ కూడా కార్యక్రమాలు రూపొందించుకుంటోంది. అయితే... రాజకీయంగా చూసుకుంటే... ఇది కూటమి పార్టీల మధ్య బాగా సున్నితమైన అంశంగా మారుతున్న సౌండ్ వినిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ హామీలిచ్చింది టీడీపీ. అధికారంలోకి వచ్చాక వాటి అమలుపై దృష్టి సారించింది.
ఏపీలో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రారంభిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వృద్ధాప్య పెన్షన్, తల్లికి వందనం, దీపం పథకం ద్వారా ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది. ఈ విషయాలను ప్రభుత్వ ప్రజలకు వివరించనుంది.
ఎలక్షన్స్ తర్వాత రాష్ట్రంలో బీజేపీ, ఏఐఏడీఎంకేలతో కూడిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అన్నారు. ఇక, ముఖ్యమంత్రి అభ్యర్థి ఏఐఏడీఎంకే నుంచి ఉంటారని స్పష్టం చేశారు. కాగా, పార్టీ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి (ఈపీఎస్) పేరును అమిత్ షా ప్రస్తావించలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ మళ్లీ పొగలు సెగలుగక్కుతోందా అంటే..... పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనకు తొలి అడుగు సభ జరిగింది. ఈ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగం చుట్టూ ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది.
ఒకడు నరికేస్తాం అంటాడు. ఇంకొకడు కోసేస్తాం అంటాడు.. ఇవన్నీ మాట్లాడితే తప్పేంటి అని జగన్ అంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు అనిత. ఎక్కడ యాక్సిడెంట్ అయిన ఎవరైనా ఏదో ఒక సహాయం చేస్తారు.. స్వయంగా సీఎం చంద్రబాబు దిగి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ కు తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు.. కానీ, జగన్ కు మానవత్వం లేదనే సంగతి క్లియర్ గా అర్ధం అవుతోందన్నారు..
YS Jagan: ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను చంద్రబాబు ప్రభుత్వం తాకట్టు పెట్టిందన్నారు.
Nitish Kumar: బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు వస్తుండటంతో.. ప్రజలను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి.