Tejashwi Yadav: మరికొన్ని రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగబోతోంది. ఇప్పటికే, పాలక బీజేపీ-జేడీయూ కూటమితో పాటు ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్‌లు ప్రచారాన్ని మొదలుపెట్టాయి., మరోవైపు, కేంద్ర ఎన్నికల సంఘం ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ ద్వారా ఫేక్ ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తోంది. అయితే, ఈ వ్యవహారంపై ఆర్జేడీ, కాంగ్రెస్‌తో సహా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఓటర్ల జాబితాను ఎన్డీయేకు అనుకూలంగా మార్చడానికి ఎన్నికల సంఘం పనిచేస్తోందని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ…
రాజధాని ప్రాంతం అమరావతి రైతులకు తీపికబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రైతులకు సంబంధించిన 11వ ఏడాది కౌలు సొమ్మును విడుదల చేసింది సర్కార్.. 163.67 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇందుకోసం ఈసీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇంకోవైపు అధికార-ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
Vice presidential poll: సోమవారం జగదీప్ ధంఖర్ ఆకస్మిక రాజీనామాతో భారత ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయింది. వైద్య కారణాలను చూపుతూ ధంఖర్ సోమవారం సాయంత్రం ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముకు పంపారు, తక్షణమే తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. దీంతో మరోసారి ఎన్నికలు అనివార్యమయ్యాయి.
CM Chandrababu: గ్రీన్ హైడ్రోజెన్ సమిట్ లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ ఆలోచనలు వినటానికి ఆవిష్కరణలు తెలుసుకోవడానికి ఇక్కడకు వచ్చాను.. విద్యుత్ సంస్కరణలు దేశంలో తొలి సారి ప్రారంభించింది నేనే.
వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేసిన రాహుల్.. నా బావ రాబర్టుని ఈ కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా వెంటాడుతోంది అని ఆరోపించారు.
వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి నాదెండ్ల మనోహర్.. అవగాహన లేకుండా, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అంటూ ధ్వజమెత్తారు. ప్రజలు అధికారాన్ని ఐదేళ్లకు ఇస్తారు.. అది జగన్ మర్చిపోయారా? అని నాదెండ్ల ప్రశ్నించారు. ఇంతకాలం గుంతలు కూడా పూడ్చలేని నాయకుడు.. ఈ రోజు పాలన గురించిమాట్లాడుతున్నాడు అంటూ ఫైర్ అయ్యారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ చీఫ్ వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. విశాఖ పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అబ్బద్ధాలను ప్రచారం చేయడంలో ఆరి తేరిందన్నారు.. వాళ్ల భాష, పరామర్శలు రాష్ట్ర ప్రజలు అంతా చూస్తున్నారన్న ఆయన.. వేలాది మందితో వెళ్లి చేసేది పరామర్శా? లేక దండ యాత్రో.. వాళ్లే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు..
Minister Narayana: రైతులకు కేంద్రం ఇచ్చే 6 వేలతో కలిపి మొత్తం 20 వేలు ఇస్తామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా తల్లికి వందనం పథకం ద్వారా 10 వేల కోట్లు విద్యార్ధుల తల్లుల ఖాతాలో జమ చేశామని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈరోజు (జూలై 15న) ఉదయం 9.45 గంటలకి గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 11.45 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు.