Bhumana Karunakar Reddy: వైఎస్ జగన్ చూస్తే కూటమి నాయకులకు భయం, అందుకే రైతుల వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి.. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు అవస్థలు పడుతున్నారు.. రైతుల కోసం బంగారుపాల్యం గ్రామనికి వస్తున్నారు.. అప్పుడే కూటమి నాయకులు రైతులను వేధింపులకు గురిచేస్తున్నారు.. జగన్‌ను చూస్తే కూటమి నాయకుల భయం అన్నారు.. మరోపక్క వైసీపీ నాయకులను భయపెడుతున్నారు.. జనసేన, టీడీపీ వారు జగన్ పర్యటన రద్దు అయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. జగన్ రావడం ఖాయం.. రైతులు కలవడం పక్కా అని స్పష్టం చేశారు..
కుమార్ అనే రైతు నష్టాలకు భరించలేక, చెట్లు నరికేశాడు.. దానికి ఫారెస్ట్ అధికారుల కుమార్ అనే రైతు నానా ఇబ్బందులు పెట్టారని విమర్శించారు భూమన కరుణాకర్ రెడ్డి.. 16 చెట్లకు గాను, 12,400 రూపాయల ఫైన్ వేసారు.. ఒకరోజు రైతును నిర్బంధం చేసారు.. ఓ మామిడి రైతు కూటమి ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇది అని మండిపడ్డారు.. అటవీశాఖ పవన్ కల్యాణ్ ఆధీనంలో ఉంది.. ఓ మామిడి రైతును ఎర్రచందనం స్మగ్లర్ గా చూపించారు.. బిన్ లాడెన్ పై అమెరికా దాడిచేసినట్లు, మారుమూల గ్రామంలో ఉన్న రైతును భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు నిజాలను చెబితే తట్టుకోలేకపోతున్నారు.. ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి జగన్ వస్తున్నారని ప్రకటించారు.. జగన్ పర్యటన పై నిర్బంధాలు విధించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.. జగన్ రాష్ట్రంలోనే అత్యధిక, అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి.. జగన్ కు రక్షణ కల్పించాల్సిన భాద్యత మీదే.. హెలికాప్టర్‌కు అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ను కోరామన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి..