ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు.. రేపు ఉదయం అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు చంద్రబాబు. ఉదయం.. 9.45కి విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరి.. ఉదయం 11.45 కు ఢిల్లీ చేరుకుంటారు సీఎం చంద్రబాబు.. ఇక, మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీకానున్నారు.. ఆ తర్వాత, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, ఢిల్లీ మెట్రో…
Ambati Rambabu: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. కూటమి ఏడాది పాలన సుపరిపాలన కాదు.. మోసపు పరిపాలన.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికారపక్షమైన ఎన్డీయే ఇప్పటికే మహిళా రిజర్వేషన్, పెన్షన్ పెంపుపై హామీ ఇచ్చింది. తాజాగా రాష్ట్ర ప్రజలకు మరో పథకం ఇచ్చేందుకు నీతీశ్‌కుమార్ ప్రభుత్వం సిద్దమైంది. 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖ ఆమోదించింది కానీ.. కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు…
వైఎస్ జగన్ పర్యటనలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్.. శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ పరామర్శ పేరుతో దండయాత్రలు చేస్తున్నారని విమర్శించారు.. పోలీసులు రక్షణ ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు.. ఎక్కువ మంది పోలీసులను పెడితే.. 2 వేల మంది పోలీసులను పెట్టారని మళ్లీ ఇప్పుడు కామెంట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశ జరగనుంది.. రాజధాని లో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది కేబినెట్.. 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా ఆమోదం తెలపనుంది.. రాజధాని నిర్మాణానికి ఇసుక డీసిల్టేషన్‌కు అనుమతి ఇవ్వనుంది కేబినెట్..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ నితీష్ కుమార్ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలోనూ మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు నితీష్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గత నెల 30వ తేదీన విజయవాడలో జరిగిన 'అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్‌షాప్ నిర్వహించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం. ఈ వర్క్‌షాప్ ద్వారా ప్రభుత్వ, పరిశ్రమ, విద్యా సంస్థలు, స్టార్టప్‌లు కలిసి కొత్త టెక్నాలజీని సమన్వయంతో పనిచేసే దిశగా చర్చలు తీసుకోవాలని తెలిపింది ప్రభుత్వం.
వైఎస్ జగన్ చూస్తే కూటమి నాయకులకు భయం, అందుకే రైతుల వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి..
మామిడి రైతులకు అండగా నిలిచింది కూటమి ప్రభుత్వం.. మామిడి రైతుల విషయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనవసర రాజకీయాలు చేస్తుందంటూ మండిపడుతున్నారు ప్రభుత్వ పెద్దలు.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా కిలోకి 4 సబ్సిడీ ఇచ్చి రైతులకు అండగా నిలబడిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నష్టాన్ని ముందుగానే అంచనా వేసి మామిడి రైతులను ఆదుకోవాలని సబ్సిడీ ఇచ్చామంటున్నాయి ప్రభుత్వ వర్గాలు..