Bihar: ఎన్నికల ముందు బీహార్‌ను కుదిపేస్తున్న మటన్ పాలిటిక్స్
- ఎన్నికల ముందు బీహార్‌ను కుదిపేస్తున్న మటన్ పాలిటిక్స్
- శ్రావణమాసంలో ఎన్డీఏ నేతలు మాంసాహారం తినడంపై తేజస్వి యాదవ్ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇందుకోసం ఈసీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇంకోవైపు అధికార-ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎవరికి వారే ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అయితే ఏ చిన్న అవకాశం దొరికినా అధికార పార్టీని ఇరాకటంలో పడేసేందుకు ప్రతిపక్ష పార్టీ ప్రయత్నిస్తోంది. తాజాగా మటన్ పాలిటిక్స్ రాష్ట్రంలో హీటెక్కిస్తోంది.
ఇది కూడా చదవండి: Bihar: ఓటర్ సర్వేపై దద్దరిల్లిన బీహార్ అసెంబ్లీ… అధికార-ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ప్రస్తుతం దేశంలో శ్రావణమాసం నడుస్తోంది. అయితే శ్రావణమాసంలో హిందువులు నాన్‌వెజ్ తినరు. కానీ సోమవారం ఎన్డీఏ సమావేశంలో నాన్ వెజ్ వంటకాలు ఏర్పాటు చేశారు. పాట్నాలోని అసెంబ్లీలో జరిగిన విందు వంటకాల్లో మటన్ లేబుల్ కనిపించింది. దీంతో శ్రావణమాసంలో మటన్ ఆరగించడమేంటి? అని ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ విమర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇతరులను విమర్శిస్తారు కానీ.. తమ విషయంలో మాత్రం సనాతన ధర్మం పాటించారా? అంటూ నిలదీశారు. ఎందుకు ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు అంటూ ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో దారుణం.. భర్త అలా చేయలేదని చంపేసిన భార్య
మటన్ తిన్నవారిలో మోడీకి చెందిన ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారని.. శ్రావణమాసంలో రోజుకు 3 కిలోల మటన్ తింటారని.. కానీ ఇతరులకు సనాతన ధర్మం గురించి బోధిస్తారంటూ ఎద్దేవా చేశారు. తినే ఆహారంపై తమకు అభ్యంతరం లేదు గానీ.. ప్రధాని మోడీ మాత్రం ఇతరులను విమర్శిస్తారంటూ ధ్వజమెత్తారు.
2023 శ్రావణ మాసంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మటన్ భోజనం ఆతిథ్యం ఇచ్చారు. ఆనాటి దృశ్యాలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం శ్రావణ మాసంలో ఎన్డీఏ నేతలు మాంసాహారం తినడంపై తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు.
प्रधानमंत्री श्री @narendramodi जी के असीम आशीर्वाद और कृपा से सावन के सोमवारी को दबा कर मटन 🥩 चापते बीजेपी के मंत्री और विधायक।
मोदी जी की कैबिनेट में बिहार से तीन ऐसे मंत्री है जो सावन में भी प्रतिदिन 3 किलो मटन खाते है लेकिन दिखावटी तौर पर सनातन पर लंबा चौड़ा ज्ञान देते है।… pic.twitter.com/NuvuOwEzKy
— Tejashwi Yadav (@yadavtejashwi) July 21, 2025
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!