అర్ధరాత్రి వైసీపీ మహిళా నేతల ఇంటి తలుపు తీసి నోటీసులు తీసుకుని వెళ్లమని చెబుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మీకు ఏం పోయేకాలం వచ్చిందని, అర్ధరాత్రి నిద్రలేపి నోటీసులు ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించారు. నెల్లూరులో ఉన్న 40 శాతం ఓటర్లకు నోటీసులు ఇచ్చారని, ఇంట్లో వైఎస్ జగన్ ఫోటో ఉంటే చాలు నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటీష్ వాళ్లకు, చంద్రబాబు నాయుడుకు తేడా ఉందా? అని.. మహాత్మా గాంధీని కూడా రోడ్డు మీదకు రాకుండా చేస్తే ఎవరైనా ఆగారా? అని అడిగారు. ఆనాటి బ్రిటిష్ పాలకులకు ఏ కర్మ పట్టిందో.. మీకు కూడా అదే కర్మ పడుతుంది అని పేర్ని నాని అన్నారు.
‘లిక్కర్ కేసులో సిట్ కట్టు కథలకు అడ్డే లేదు. మీరు ఎన్ని కట్టు కథలు చెప్పినా జంకేది లేదు. వైఎస్ జగన్ పర్యటనల మీద విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఎలా అయినా తిరగొచ్చు. ఆఖరికి చంద్రబాబు సతీమణి కూడా ఎన్ని కార్లయినా తీసుకుని వెళ్ళొచ్చు. పవన్ కళ్యాణ్ రైతుల ఆత్మహత్యల పేరిట పెద్ద మీటింగులు పెట్టారు. మేము అనుమతులు ఇవ్వకపోతే మీరు పర్యటనలు చేసేవారా?. ఊరేగింపులు ఎందుకు చేస్తున్నారు అని జగన్ అడిగారా?. లోకేష్ మూడు కార్లలోనే వెళ్లారా. చంద్రబాబు లెక్కపెట్టి వాహనాలు పెట్టుకున్నారు. మీరు ఇప్పుడు భయంలో ఉన్నారు. ప్రజల్లో మీపై వ్యతిరేకత పెరిగింది. జగన్ రాగానే ధైర్యం వస్తుంది.. ఆయన కోసం చుస్తున్నారు. జైలు దగ్గర 10 కంటే ఎక్కువ వస్తే కేసు పెడతాం అని నోటీసు ఇచ్చారు. అర్ధరాత్రి వైసీపీ మహిళా నేతలకు పోలీసులు తలుపు తీసి నోటీసులు తీసుకుని వెళ్లమని చెబుతారు. మీకు ఏం పోయే కాలం వచ్చింది.. నిద్రలేపి నోటీసులు ఇస్తారా?. నెల్లూరులో ఉన్న 40 శాతం ఓటర్లకు నోటీసులు ఇచ్చారు. ఇంట్లో జగన్ ఫోటో ఉంటే చాలు నోటీసులు ఇస్తున్నారు. బ్రిటీష్ వాళ్లకు, చంద్రబాబుకు తేడా ఉందా. మహాత్మా గాంధీని కూడా రోడ్డుమీదకు రాకుండా చేస్తే ఎవరైనా ఆగారా. ఆనాటి బ్రిటిష్ పాలకులకు ఏ కర్మ పట్టిందో.. మీకు కూడా అదే కర్మ పడుతుంది’ అని పేర్ని నాని అన్నారు.
‘వైఎస్ జగన్ మీద జనాలకు ఉన్న ప్రేమను అణగదొక్కటం మీ వల్ల కాదు. తురకా కిషోర్ వడ్డెర కులానికి చెందిన యువనేత. ఇప్పుడిప్పుడే రాజకీయం ఎదుగుతూ మున్సిపల్ చైర్మన్ అయ్యారు. విజయవాడ నుంచి ఇద్దరు ఆకు రౌడీలు మాచర్ల వెళ్లి తొడగొడితే కొన్ని పరిణామాలు జరుగుతాయి. ఎన్నాళ్లు ఆయనను జైళ్లో పెట్టగలరు. మీ ప్రభుత్వం కూలేదాకా పెట్టగలరు. ఇప్పటికి ఏడాది అయ్యింది.. ఇంకొక నాలుగేళ్లు పెట్టుకోండి. ఐదేళ్లు ఒక్క మనిషిని జైళ్లో మగ్గపెడితే ఆ తర్వాత విచారణ జరగదా. పాపం పండితే అన్నీ జరుగుతాయి. మీరు ఎన్ని వేధింపులు చేసినా ఎన్నికల్లో మీ కూటమి ప్రభుత్వం కుప్పకూలటం ఖాయం. కిషోర్ కుటుంబంతో పాటు ప్రతీ వైసీపీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది. చేసిన పాపం వాళ్ళు మూట కట్టుకుంటారు. మళ్ళీ చెవిరెడ్డి, బాలాజీ గోవిందప్పను తీసుకువచ్చారు. జగన్ రెడ్డికి షేర్ ఉంది.. తీసుకువచ్చాం అంటారు. జగన్ వ్యాపారాలు చేసుకోకూడదా?. ఇప్పుడు మళ్ళీ వరుణ్ అంటున్నారు. ఒంగోలు టోల్ గేట్ దగ్గర పట్టుకున్న డబ్బులు కూడా జగన్ గారివే అనేలా ఉన్నారు. వంద రోజులు అయ్యింది.. వీళ్లు వయసై పోయినవాళ్ళు. బెయిల్ వస్తుందని కొత్త కథ అల్లుతున్నారు. కాసేపు ఒకరకంగా.. ఇంకా కాసేపటికి మరోలా మాట్లాడుతున్నారు. అందరికీ బెయిల్ వాదనలు జరుగుతున్నాయని కేసును లైన్లోకి తెస్తున్నారు. లక్ష కోట్ల నుంచి మూడు వేల కోట్లు అన్నారు. చివరికి లక్ష కోట్ల నుంచి 11 కోట్లకు తెచ్చారు. డబ్బాలు 12 అంటే.. కోట్లు 11 అంట.. మిగతా కోటి ఎవరు నొక్కేసినట్లు. అసలు ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తారో లేదో కూడా తెలియదు. అసలు ఆ డబ్బులు ఎవరివి. అంత లిక్కర్ కింగ్ ఇన్నాళ్లు 11 కోట్లు వాళ్ళ దగ్గర పెడతారా’ అని మాజీ మంత్రి ప్రశ్నించారు.
Also Read: ENG vs IND 5th Test: నలుగురు స్టార్స్ అవుట్.. ఇంగ్లండ్ తుది జట్టు ఇదే!
‘వైఎస్ జగన్ మీలా నేరం చేసి ఉంటే వీళ్లను ఇండియాలో ఉంచుతారా. మీరు శ్రీనివాస్ ను అమెరికా పంపినట్లు పంపరా.. రెండు వేల కోట్ల రూపాయల లెక్కలు చూపని డబ్బు చంద్రబాబు పీఏ దగ్గర దొరికిందని ఇన్కంటాక్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మళ్ళీ చంద్రబాబు పీఏ విదేశాలకు వెళ్లిపోయారు. చంద్రబాబు సీఎం కాగానే వచ్చి ఉద్యోగం చేరాడు. మీకు మూటలు మోసాడు కాబట్టి వెంటనే ఉద్యోగం ఇచ్చారు. మేము లిక్కర్ పాపం చేసి ఉంటే వీళ్ళందరూ ఎప్పుడో దేశం దాటి ఉండేవారు. మేము కూడా పంపేవాళ్ళం కదా. మేం ఏదైనా ఫేస్ చేస్తామని ఉన్నాం. జగన్ కు బాధ్యత లేదు కాబట్టి బెంగుళూరు వెళ్ళి వస్తున్నారు. మీకు అన్నీ బాధ్యతలు ఉన్నాయి, మీరు ఎందుకు హైదరాబాద్ వెళ్తున్నారు. జగన్ రెడీగానే తాడేపల్లిలో ఉంటాను అని చెప్పారు కదా?’ అని వైసీపీ నేత పేర్ని నాని పేర్కొన్నారు.