CM Chandrababu: గ్రీన్ హైడ్రోజెన్ సమిట్ లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ ఆలోచనలు వినటానికి ఆవిష్కరణలు తెలుసుకోవడానికి ఇక్కడకు వచ్చాను.. విద్యుత్ సంస్కరణలు దేశంలో తొలి సారి ప్రారంభించింది నేనే.. సంస్కరణలు అమలు చేసిన కారణంగా నేను అప్పట్లో అధికారం కోల్పోయాను.. తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్ తయారీ, స్టోరేజీపై ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు. గ్లోబల్ వార్నింగ్ నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్ కు ప్రాధాన్యం పెరిగింది.. విద్యుత్ తయారీ సంస్థలు ఈ విషయంపై పరిశోధనలు చేయాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Jagtial: ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని.. యువకుడిని హ*త్య చేసిన యువతి బంధువులు
ఇక, ఏపీ ఇలాంటి పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్ర బిందువు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ హైడ్రోజన్ కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది.. 500 గిగావాట్ల హరిత విద్యుత్ తయారీ చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.. నీతి అయోగ్ కూడా దీనిపై దృష్టి సారించింది.. ఎనర్జీ తయారీకి ఖర్చును ఎలా తగ్గించాలి అని ఆలోచిస్తున్నాం.. రెండు రోజులు పాటు మీరు ఇక్కడ ఉంటారు.. మన ప్రధాని కూడా 500 గిగావాట్ తో డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీగా గ్రీన్ ఎనర్జీపై కృషి చేస్తన్నారు.. ఏపీ హైడ్రోజన్ వ్యాలీగా మారాలని నిర్ణయించాం.. దానికి అవసరం అయినా టెక్నాలజీ మీరు తీసుకురావాలని సూచించారు. మీ అందరికి బెస్ట్ ప్లేస్ ఏపీలో ఉంది.. కాబట్టి మీరు అందరు ముందుకు రావాలని చంద్రబాబు కోరారు.