Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన శివసేన, ఎన్సీపీల్లో చీలికలు ఏర్పడ్డాయి. ఈ రెండు చీలిక వర్గాలు బీజేపీతో ప్రభుత్వాన్ని పంచుకుంటున్నాయి. ముఖ్యంగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ని కాదని అజిత్ పవార్ బీజేపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. అజిత్ పవార్ తో పాటు శరత్ పవార్ నమ్మినబంట్లుగా పేరున్న నేతలు కూడా అజిత్ వర్గంలోనే ఉన్నారు. మెజారిటీ ఎమ్మెల్యే ఈ వర్గంతోనే జతకట్టారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కలిశారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో చివరిసారిగా సమావేశం కాగా.. ప్రతిపక్ష ఇండియా కూటమి కోసం ముందుకు సాగే ప్రణాళికపై చర్చించినట్లు తెలిసింది.
Sharad Pawar: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ బీజేపీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తుపై మాట్లాడుతూ.. బీజేపీతో వెళ్లే ప్రశ్నే లేదని కుండబద్ధలు కొట్టారు. ఇండియా టుడే కాంక్లేవ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే శరద్ పవార్ పార్టీ ఎన్సీపీలో చీలిక వచ్చింది. అజిత్ పవార్ వర్గం బీజేపీ, ఏక్నాథ్ షిండే శివసేనతో చేతులు కలిపి మహారాష్ట్రలో అధికారంలో ఉంది.
జీ-20 విందులో రాష్ట్రపతిని 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా' అని రాయకుండా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని రాయడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు.
ముంబయిలో మూడో సమావేశాన్ని నిర్వహిస్తున్న ప్రతిపక్ష కూటమి ఇండియా, దాని భాగస్వామ్య పార్టీలకు చెందిన 13 మంది సభ్యులతో కూడిన కేంద్ర సమన్వయ కమిటీని ప్రకటించింది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని కూటమి తీర్మానాన్ని ఆమోదించింది.
బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఎవరితో ఉన్నారనే దానిపై ప్రశ్నార్థకంగా ఉందని, ఆమె బీజేపీతో పొత్తు పెట్టుకుందనే ఊహాగానాలు ఉన్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ బుధవారం అన్నారు.
INDIA vs NDA: 2024 లోక్సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆప్, ఆర్జేడీ, ఎస్పీ, జేడీయూ వంటి 26 పార్టీలు ఇండియా పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చీలిక లేదని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శదర్ పవార్ తెలిపారు. పార్టీలో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహారిస్తున్నామని తెలిపారు.
ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్ లేదా ఆయన కుమార్తె సుప్రియా సూలేకు కేంద్ర క్యాబినెట్ బెర్త్ ఆఫర్ చేసినట్లు కాంగ్రెస్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మీడియా కథనంపై స్పందిస్తూ, తనను ఎవరూ సంప్రదించలేదని సుప్రియా సూలే చెప్పారు.
ప్రతిపక్ష కూటమి 'ఇండియా'(ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్) తన మూడో సమావేశాన్ని ఆగస్టు 15 తర్వాత లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ముంబైలో నిర్వహిస్తుందని కాంగ్రెస్ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే శుక్రవారం ప్రకటించారు.