Raj Thackeray: భారతీయ జనతా పార్టీపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ఠాక్రే హాట్ కామెంట్స్ చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్, ఠాక్రే బ్రాండ్లను అంతం చేసేందుకు కమలం పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
మహారాష్ట్ర కేబినెట్లో మంగళవారం ఒక కీలక పరిణామం జరగనుంది. దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రివర్గంలో ఎన్సీపీకి చెందిన 77 ఏళ్ల రాజకీయ కురు వృద్ధుడు ఛగన్ భుజ్బాల్ చేరనున్నారు.
Congress: మహారాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ పీసీసీ చీఫ్ నానా పటోలే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతుంటే, శివసేన నేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ తమతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆఫర్ ఇచ్చారు. ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేసి ప్రతిపక్షంతో చేరితే షిండే, పవార్లు ఇద్దరికీ ముఖ్యమంత్రి పదవులు ఇస్తామని పటోలే శుక్రవారం అన్నారు.
మహారాష్ట్రలో ఓ సర్పంచ్ హత్య కేసు కూటమి ప్రభుత్వంలో రాజకీయ దుమారం రేపింది. బీడ్ జిల్లాలో డిసెంబర్ 9న సర్పంచ్ సంతోష్ దేశ్ముఖ్(45) హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఫిబ్రవరి 27న పోలీసులు ఛార్జ్షీటు దాఖలు చేశారు. ఇందులో ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే సన్నిహితుడి పేరు ఉంది.
మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వంలో ముసలం మొదలైనట్లుగా కనిపిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం చీలికల దిశగా వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు ‘వై’ భద్రతను దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో విభేదాలు మొదలయ్యాయి.
Maharashtra: మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో చీలికలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హోం శాఖ మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలకు ఉన్న వై కేటగిరి సెక్యూరిటీని ఉపసంహరించుకున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు.
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి హీటెక్కుతున్నాయి. ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అంటూ తలపడ్డ మహాయుతి-ఎంవీఏ కూటమిలు.. తాజాగా గతంలో ఎంవీఏ ప్రభుత్వం చేసిన కుట్రలను ప్రస్తుతం ప్రభుత్వం బట్టబయలు చేస్తోంది.
మహారాష్ట్ర రాజకీయాల్లో గురువారం మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కుటుంబ విభేదాలతో దూరంగా ఉంటున్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్-ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ ఒకే వేదిక పంచుకున్నారు.
నూతన సంవత్సరంలో మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. నిన్నామొన్నటిదాకా విడివిడిగా ఉన్న అజిత్ పవార్-శరద్ పవార్ కుటుంబాలు మళ్లీ ఒక్కటి కాబోతున్నాయన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పడింది. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా.. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మూడు పార్టీల నుంచి మంత్రులుగా ప్రమాణస్వీకారం కూడా చేశారు.