INS Vikrant: కీలక మైలురాయిని దాటిన ఐఎన్‌ఎస్ విక్రాంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INS Vikrant: భారత్‌కు చెందిన మొట్టమొదటి విమాన వాహక నౌక ఓ చారిత్రక మైలురాయిని దాటింది. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై తొలిసారి ఓ నౌకాదళ స్వదేశీ యుద్ధ విమానం ల్యాండ్ అయింది. ఎల్‌సీఏ తేజస్ (నేవీ) విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై తొలిసారిగా విజయవంతంగా ల్యాండ్ అయింది. సముద్ర ట్రయల్స్‌లో భాగంగా ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై భారత్‌కు చెందిన స్వదేశీ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) తేజస్ వెర్షన్ విజయవంతంగా ల్యాండ్ అయింది. ఓ ఫిక్స్‌డ్ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఈ నౌకపై ల్యాండ్ కావడం కూడా ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
Turkey Earthquake: టర్కీ-సిరియా భూకంపం.. ముందే హెచ్చరించిన డచ్ పరిశోధకుడు
Also Read
- Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
- iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
- BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై తేలికపాటి యుద్ధ విమానాన్ని ల్యాండింగ్ చేయడం ద్వారా నావికాదళ పైలట్లు, భారతీయ నావికాదళం ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ఒక చారిత్రక మైలురాయి సాధించింది. ఇది స్వదేశీ విమానాల రూపకల్పన, అభివృద్ధి, నిర్మాణం, నిర్వహణలో భారతదేశ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందని భారత నౌకాదళం ఒక ప్రకటనలో తెలిపింది. స్వదేశీ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్ (నేవీ) విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ నుంచి బయలుదేరింది. రూ.20,000 కోట్ల వ్యయంతో నిర్మించిన 45,000 టన్నుల ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను గతేడాది సెప్టెంబర్‌లో ప్రారంభించారు. 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పుతో, ఐఎన్‌ఎస్ విక్రాంత్ భారతదేశంలో నిర్మించిన అతిపెద్ద యుద్ధనౌక. మిగ్-29కే, హెలికాప్టర్‌లతో సహా 30 యుద్ధ విమానాలను ఇది మోసుకెళ్లగలదు. ప్రస్తుతం ఈ యుద్ధనౌకపై ఏవియేషన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!