*ఒకేసారి సెంట్రల్ జైలుకు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.. అయితే, ములాఖత్‌లో చంద్రబాబును కలిసేవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది.. ఇప్పటికే నారా ఫ్యామిలీ చంద్రబాబును కలిసింది.. 40 నిమిషాల పాటు చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేష్, బ్రహ్మణి భేటీ అయ్యారు.. మరోవైపు.. ఈ రోజు సుప్రీంకోర్టు న్యాయవాది, ప్రస్తుతం చంద్రబాబు కేసును వాదిస్తోన్న సిద్ధార్థ్ లూథ్రా కూడా ములాఖత్‌లో చంద్రబాను కలిశారు.. ఈ కేసు విషయంలో న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై చర్చించారు. ఇక నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ కలబోతున్నారు. నేడు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి తొలిసారి ఒకే పొలిటికల్ స్క్రీన్‌పై కనిపించనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుతో బాలయ్య, పవన్, లోకేష్ ములాఖత్ కానున్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సెంట్రల్ జైలుకు రానున్నారు. అదే సమయానికి క్యాంపు నుంచి సెంట్రల్ జైలుకు బాలయ్య, లోకేష్ రానున్నారు. ములాఖత్ తర్వాత జైలు దగ్గర ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. నేడు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ రానున్న నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భద్రతను పెంచారు. 300 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రభుత్వాసుపత్రి , ఆర్ట్స్ కాలేజీల వద్ద భారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు దారి మళ్లింపు చేపట్టారు. ఎయిర్‌పోర్టు నుంచి సెంట్రల్ జైలు వరకు ప్రధాన జంక్షన్ల వద్ద పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. ముగ్గురు కలిసి 11:30 తర్వాత చంద్రబాబుతో ములాఖత్ కానున్నట్లు సమాచారం. ములాఖత్ తర్వాత నేరుగా రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి హైదరాబాద్ పవన్ వెళ్లనున్నారు.
*చంద్రబాబు, నారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్లు.. నేడు హైకోర్టులో విచారణ
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది. అంగల్లు ఘటనలో ఏ1 గా ఉన్న చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు విచారణకు లిస్ట్ అయింది. ఇదిలా ఉండగా.. ఇవాళ పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చంద్రబాబుతో ములాఖత్‌కు వెళ్లనున్నారు. ఒకేసారి చంద్రబాబును జైలులో కలవనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుతో బాలయ్య, పవన్, లోకేష్ ములాఖత్ కానున్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సెంట్రల్ జైలుకు రానున్నారు. అదే సమయానికి క్యాంపు నుంచి సెంట్రల్ జైలుకు బాలయ్య, లోకేష్ రానున్నారు. ములాఖత్ తర్వాత జైలు దగ్గర ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. నేడు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ రానున్న నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భద్రతను పెంచారు. 300 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రభుత్వాసుపత్రి , ఆర్ట్స్ కాలేజీల వద్ద భారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు దారి మళ్లింపు చేపట్టారు. ఎయిర్‌పోర్టు నుంచి సెంట్రల్ జైలు వరకు ప్రధాన జంక్షన్ల వద్ద పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. ముగ్గురు కలిసి 11:30 తర్వాత చంద్రబాబుతో ములాఖత్ కానున్నట్లు సమాచారం. ములాఖత్ తర్వాత నేరుగా రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి హైదరాబాద్ పవన్ వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా.. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ కూడా ముందస్తు పిటిషన్ దాఖలు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో ఇప్పటికే నారాయణకు మెడికల్ గ్రౌండ్స్ మీద మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఏ తరుణంలోనే ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు పిటిషన్ దాఖలు చేశారు. ఇక నేడు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఇవాళ ముందస్తు బెయిల్ తుది విచారణ చేపట్టనుంది న్యాయస్థానం.
*కిషన్ రెడ్డి దీక్షభగ్నం.. నేడు జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలు..
కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో ఉద్రిక్తత కొనసాగతుంది. ఇందిరాపార్క్ దగ్గర దీక్షను భగ్నం చేయడంతో బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డితోపాటు పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్నా చౌక్ నుంచి కిషన్‌రెడ్డిని తరలించేందుకు ప్రయత్నించగా.. బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి వదిలిపెట్టారు. అయినా కూడా కిషన్ రెడ్డి తన పార్టీ కార్యాలయంలో దీక్ష ప్రారంభించారు. రాత్రి నుంచి కార్యాలయంలోనే పార్టీ నేతలతో కలిసి ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటల వరకు కిషన్ రెడ్డి దీక్ష కొనసాగనుంది. 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశారని ఆరోపిస్తూ నిన్న కిషన్ రెడ్డి ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద 24 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే బుధవారం సాయంత్రం 6 గంటల వరకు దీక్షకు అనుమతి ఉన్నందని.. వెంటనే దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయాలని పోలీసులు కిషన్ రెడ్డికి సూచించారు. ఇవాళ ఉదయం 6 గంటల వరకు దీక్ష చేస్తానని పోలీసులకు తెలిపారు. పోలీసులు ససేమిరా అన్నారు. దీంతో పోలీసులు రాత్రి 8 గంటలకు ఆయన దీక్షను భగ్నం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్‌లో పరామర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగించాలని సూచించారు. పోరాటానికి కేంద్ర పార్టీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయడంపై ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే భగ్నం చేస్తారా అని ప్రశ్నించారు. నిరుద్యోగులపై సీఎం కేసీఆర్ చేస్తున్న మోసాలను ప్రభుత్వం మరుగున పడేసేలా దీక్షలు చేస్తుంటే సహించేది లేదన్నారు. పాట పాడే సమయానికి రజాకార్ల పాలన అంతమైందన్నారు. ప్రభుత్వ తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. అకస్మాత్తుగా పోలీస్ లు వచ్చి దీక్ష కు భగ్నం చేశారని మండిపడ్డారు. ఎందుకు భగ్నం చేశారు? అని ప్రశ్నించారు. ఉపవాసం ఉంది కిషన్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు.. కేసీఆర్ మిమ్మల్ని ఉపవాసం ఉండాలని అడగడం లేదు కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి యుతంగా దీక్ష చేస్తే మీకు వచ్చే నష్టం ఏంది అని మండిపడ్డారు. కేంద్ర మంత్రి అని కనీస మర్యాద లేకుండా ప్రవర్తించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన తీరు అవమానకరంగా ఉందన్నారు. నేడు జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
*కోటాలో విద్యార్థుల సూసైడ్.. ఎఫైర్ల వల్లే అంటూ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఈ మధ్య రాజస్థాన్ లోని కోటా జిల్లాలో ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. జాతీయ స్థాయి ఎంట్రన్స్ పరీక్షల కోచింగ్‌కు ప్రధాన కేంద్రం రాజస్థాన్ లోని కోటా. ఇటీవల కోటాలో కోచింగ్ తీసుకుంటున్న 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై రాజస్థాన్ మంత్రి శాంతి ధరీవాల్ స్పందించారు. నెంబర్ 1 గా ఉండాలని తల్లిదండ్రులు చేసే ఒత్తిడి, ఎఫైర్ల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతి కేసు విషయంలోనూ లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని, తాజాగా ఆత్మహత్య చేసుకున్న ఝార్ఖండ్ బాలిక సూసైడ్ లెటర్ రాసి చనిపోయిందని, ఆమెకు ఎఫైర్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చిందని పేర్కొ్న్నారు. మంగళవారం కోటాలో ఓ విద్యార్థిని ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ సందర్భంలోనే బిహార్ నుంచి వచ్చిన ఓ విద్యార్థి సూసైడ్ చేసుకున్న విషయాన్ని కూడా ఉటంకించిన మంత్రి తాను మిగతా విద్యార్థుల కంటే బాగా చదవలేకపోతున్నానని వారి కంటే వెనుకబడి ఉన్నాననే కారణంతో ఆ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. ఎప్పుడూ మార్కులు తెచ్చుకోవాలని తల్లిదండ్రులు చేసే ఒత్తిడి కారణంగా పిల్లలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇక హాస్టల్స్ లో ఆత్మహత్యలు జరగకుండా ఫ్యాన్లకు స్ప్రింగ్ లు ఉంచాలని హాస్టల్స్ ను ఆదేశించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం ఎఫైర్ల కారణంగా చనిపోతున్నారంటూ మంత్రి మాట్లాడిన మాటలు దుమారాన్ని రేపుతున్నాయి. పలువురు ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. విద్యార్థుల గురించి అలా ఎలా మాట్లాడతారంటూ మండిపడుతున్నారు. ఇక ఈ ఏడాదాలో ఇప్పటి వరకు 25 మంది వరకు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే 2020-21 కాలంలో విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చిన సమయంలో ఎటువంటి ఆత్మహత్యలు జరగలేదు. మంత్రి చెప్పినట్లు నిజంగానే ఈ విషయంలో లోతుగా దర్యాప్తు జరగాల్సి ఉంది.
*రైతులకు బ్యాడ్ న్యూస్.. వాటి ధరలు పెరిగే అవకాశం
డీఏపీ, యూరియా రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ కు ఎరవులు సరఫరా చేయడంలో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న రష్యా సప్లైను కఠినతరం చేసింది. ప్రపంచ దేశాలకు చైనా కూడా ఎరువులను అందించేది. అయితే చైనా వీటి సరఫరాను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. అందుకే రష్యా ఎరువులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ దిగింది. దీంతో రష్యా మార్కెట్లు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నాయి. అందుకే ఎరువులపై ఇచ్చే సబ్సిడీలను ఎత్తివేశాయి. కేవలం మార్కెట్ ధరకు మాత్రమే యూరియా, డీఏపీ లాంటి వాటిని విక్రయిస్తున్నాయని భారత ఎరువుల కంపెనీలు పేర్కొంటున్నాయి. రష్యా కంపెనీలు ఆగస్టు నెల నుంచి ఇలా చేస్తున్నాయని, దీంతో దిగుమతి ఖర్చులు భారంగా మారాయని ఆయా కంపెనీలు పేర్కొంటున్నాయి. అయితే గతేడాది ఈ ఎరువులపై రష్యా సబ్సిడీ ఇవ్వడంతో భారతదేశం దిగుమతలు 202-23 ఆర్థిక సంవత్సరంలో 246% పెరిగి రికార్డు స్థాయిలో 4.35 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి. దీని కారణంగా చైనా, ఈజిప్ట్, జోర్డాన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సహా ఇతర ఎరువుల ఎగుమతిదారుల నుంచి భారత్ కొనుగోలులు ఘణనీయంగా తగ్గాయి. గతంలో రష్యన్ కంపెనీలు డీఏపీకి టన్నుకు 80 డాలర్ల డిస్కౌంట్ ఇచ్చాయని ఇప్పుడు ఐదు డాలర్ల డిస్కౌంట్ కూడా ఇవ్వలేదని భారతీయ కంపెనీ ఒకటి పేర్కొంది. గ్లోబల్ ఎరువుల ధరలు గత రెండు నెలలుగా పెరుగుతున్నాయి, గోధుమ పంటకు సంబంధించి డీఏపీ డిమాండ్ పెరిగినప్పుడు రాబోయే శీతాకాలంలో స్టాక్‌లను సేకరించడం భారతీయ కంపెనీలకు సవాలుగా మారిందని ముంబైకి చెందిన ఎరువుల కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. జూలైలో, ప్రపంచ ఎరువుల సరఫరాదారులు CFR ఆధారంగా టన్నుకు సుమారు $300 చొప్పున యూరియాను అందిస్తున్నారని, కానీ ఇప్పుడు టన్నుకు $400 కోట్ చేస్తున్నారని ఆయన చెప్పారు. జూలైలో డీఏపీ ధరలు టన్నుకు దాదాపు 440 డాలర్లుగా ఉందని ఆయన తెలిపారు. ఎరువుల ధరలు పెరగడం అనేది కచ్ఛితంగా రైతులపై భారం కానుందని చెప్పవచ్చు. ఈ విషయంలో ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుందో వేచి చూడాలి.
*10నెలల గరిష్టానికి ముడిచమురు ధరలు.. రెట్టింపైన ద్రవ్యోల్బణం
సరఫరా ఆందోళనల కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు 92 డాలర్లు దాటింది. బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 92.10డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, డబ్ల్యూటీఐ క్రూడ్ బ్యారెల్‌కు 88.98డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డిసెంబర్ 2023 నాటికి ముడి చమురు ఉత్పత్తిని తగ్గించాలని సౌదీ అరేబియా, రష్యా నిర్ణయించినప్పటి నుండి, ముడి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ క్రూడాయిల్ ధరల పెరుగుదల కొనసాగితే, రాబోయే పండుగ సీజన్‌లో సామాన్యుడి జేబు ఖాళీ కావొచ్చు. ముడిచమురు ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే.. అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకపోవడమే కాకుండా నేరుగా విమాన ప్రయాణికులపై ప్రభావం పడుతుంది. ముడి చమురు 10 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు, ప్రభుత్వ చమురు కంపెనీలు ఏటీఎఫ్ ధరలను గణనీయంగా పెంచే అవకాశం ఉంది. దసరా దీపావళి రోజున విమానంలో ప్రయాణించాలనుకునే వ్యక్తులు ఖరీదైన విమాన ప్రయాణం షాక్‌ను ఎదుర్కొంటారు. ఖరీదైన గాలి ఇంధనం కారణంగా విమాన ప్రయాణం ఖరీదైనది. పెయింట్ తయారీ కంపెనీలకు ముడి చమురు అత్యంత ముఖ్యమైన విషయం. ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా పెయింట్ తయారీ కంపెనీల ఖర్చులు భారీగా పెరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీపావళి రోజున ఇంటి అందాన్ని పెంచేందుకు ఇంటికి రంగులు వేయాలనే ఆలోచనలో ఉన్న వారి జేబులు మరింత లూజ్ అవుతాయి. ఖర్చులు పెరిగిన తర్వాత పెయింట్ తయారీ కంపెనీలు పెయింట్ల ధరలను పెంచవచ్చు. ముడి చమురు ధర బ్యారెల్‌కు 100డాలర్లు దాటవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా విశ్లేషకులు అంటున్నారు. ఇదే జరిగితే కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
*నేడు పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్.. భారత్‌ను ఢీకొట్టేదెవరు?
ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా నేడు కీలక మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్, శ్రీలంక నేడు ఢీ కొట్టనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆసియా కప్ ఫైనల్లో భారత్‌ను ఢీ కొడుతుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్‌కి చేరాలని ఇరు జట్లు చూస్తున్నాయి. రెండు జట్లకు ‘డూ ఆర్ డై’ అయిన ఈ మ్యాచ్‌కి వర్ఫం ముప్పు కూడా పొంచి ఉండడం గమనార్హం. బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ఇప్పటికే తమ ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించింది. పాక్‌కు ఆటగాళ్ల గాయాలు సమస్యగా మారడంతో లంకతో మ్యాచ్ కోసం ఏకంగా 5 మార్పులు చేసింది. భారత్‌తో మ్యాచ్‌లో నసీమ్ షా, హారిస్ రవూఫ్, సల్మాన్ అఘా గాయపడ్డారు. నసీమ్ టోర్నీ మొత్తానికే దూరమవగా.. లంక మ్యాచ్‌లో హారిస్ రవూఫ్ ఆడడం లేదు. ఈ ఇద్దరి స్థానాల్లో జమాన్ ఖాన్, మహమ్మద్ వసీం ఆడుతున్నారు. సల్మాన్ స్థానాన్ని షకీల్ భర్తీ చేశాడు. ఫకర్ జమాన్, ఫహీం అష్రఫ్ స్థానాల్లో హారిస్, నవాజ్ బరిలోకి దిగనున్నారు. పాక్ బ్యాటింగ్‌లో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇమాముల్, ఆజామ్ పైనే పాక్ ఆశలు పెట్టుకుంది. భారత్‌తో పోరులో విజయం కోసం లంక బాగానే పోరాడింది. అదే ఉత్సాహంతో పాక్‌ను ఓడించాలని చూస్తోంది. గాయాలతో హసరంగ, చమీర, లాహిరు కుమార లాంటి స్టార్ ఆటగాళ్ల సేవలను కోల్పోయిన లంక.. బాగానే రాణిస్తోంది. యువ స్పిన్నర్ దునిత్ వెల్లలాగె భారత బ్యాటర్లను కట్టడి చేయడం లంకకు కలిసొచ్చే అంశం. పతిరన, తీక్షణ, అసలంకతో లంక బౌలింగ్ బలంగానే ఉంది. అయితే బ్యాటింగ్ విభాగమే పుంజుకోవాల్సి ఉంది. టాప్ ఆర్డర్ రాణిస్తే గాయాలతో సతమతం అవుతున్న పాక్‌ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు.
*మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
కొన్ని రోజులుగా వరుసగా పెరిగిన బంగారం ధరలు.. 4-5 రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధరలు.. నేడు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం (సెప్టెంబర్ 14) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,450గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 340.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 380 తగ్గింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఈ రోజు ఉదయం నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,600గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,800లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,780 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,450గా కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర కూడా భారీగానే తగ్గింది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర గురువారం రూ. 73,500లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 1000 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 73,500గా ఉండగా.. చెన్నైలో రూ. 77,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 73,000 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 77,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 77,000ల వద్ద కొనసాగుతోంది.
*తెలుగులో మాత్రం తుస్సుమంది!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంత కలిసి నటించిన సినిమా ‘ఖుషి’. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ లవ్ స్టోరీ ఇటీవలే ఆడియన్స్ ముందుకి వచ్చింది. సూపర్బ్ మ్యూజికల్ ఫీల్ ఇచ్చిన ఖుషి సినిమా థియేటర్స్ లో మొదటి రోజు మార్నింగ్ షోకే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. టాక్ బాగుండడంతో విజయ్ దేవరకొండ హిట్ కొట్టేసాడని ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యారు. సెకండ్ డేకి ఖుషి టాక్ మిక్స్డ్ గా మారింది. టాక్ లో మార్పు వచ్చినా కూడా కలెక్షన్స్ లో మాత్రం ఎలాంటి మార్పులు కనిపించలేదు. ఫస్ట్ వీక్ ఎండ్ అయ్యే టైమ్ కి ఖుషి సినిమా ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ కి రీచ్ అయ్యింది. మొదటి మండే నుంచి ఖుషి మూవీ కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. యుఎస్ఏ లో 1.2 బ్రేక్ ఈవెన్ మార్క్ కాగా 1.8 మిలియన్ రాబట్టిన ఖుషి సినిమా, ఓవర్సీస్ లో ప్రాఫిటబుల్ సినిమాగా నిలిచింది. ఆస్ట్రేలియా, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ… ఇలా అన్ని సెంటర్స్ లో ఖుషి సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. ముఖ్యంగా తమిళనాడులో 10 కోట్ల గ్రాస్ ని రాబట్టి ట్రేడ్ వర్గాలకి కూడా షాక్ ఇచ్చింది. అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ అయ్యింది కదా, మంచి ప్రాఫిట్స్ మిగిలింది మరి సినిమాని ఎందుకు లాస్ వెంచర్ అంటున్నారు అంటే… ఖుషి సినిమా భారీ నష్టాలని మిగిలించింది ఆంధ్రప్రదేశ్ రీజన్ లో. ఈ ఏరియాలో ఖుషి సినిమా దాదాపు పది కోట్ల డిఫిసిట్ లో ఉంది. ఏపీలోని అన్ని ఏరియాల్లో ఖుషి బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ కాలేదు. అక్కడ పది కోట్ల లాస్ వచ్చింది కాబట్టే ఖుషి సినిమా ఫ్లాప్ లిస్టులో పడింది కానీ ఏపీలో కాస్త నష్టాలు తగ్గి ఉంటే ఖుషి మూవీ హిట్ స్టేటస్ అందుకునేదేమో.