Asaduddin Owaisi: స్వాతంత్య్రానికి ముందు దేశ విభజన గురించి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ విభజన జరగాల్సింది కాదని, చారిత్రక తప్పిదమని సోమవారం అన్నారు. హైదరాబాద్ లో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. చారిత్రత్మకంగా ఇది ఒకే దేశమని, దురదృష్టవశాత్తు విడిపోవాల్సి వచ్చిందని అన్నారు.
Supreme Court: 26 వారాల గర్భాన్ని తొలగించాలన్న వివాహిత అభ్యర్థనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)ఇచ్చిన నివేదిక ఆధారంగా.. గర్భాన్ని తొలగించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. గర్భంలో ఉన్న శిశువుకు ఎలాంటి సమస్యలు లేవని పేర్కొంది.
ఇదిలా ఉంటే తాజాగా 52 ఏళ్ల మంత్రగాడు 18 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని భదోహిలో జరిగింది. దుష్టశక్తులను తరిమేస్తానని చెబుతూ.. యువతిపై ఘోరానికి పాల్పడ్డాడు. నిందితుడిని శనివారం మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేశారు.
2036 Olympics: 2036 ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహణకు భారత్ ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టదని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించాలనే ఇండియా అభిప్రాయాన్ని ఆయన నొక్కిచెప్పారు. 2036 ఒలింపిక్స్ నిర్వహించేందుకు భారత్ బిడ్డింగ్ వెస్తుందని తెలిపారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(IOC) 141వ సెషన్‌ని మోడీ ప్రారంభించారు. 40 ఏళ్ల విరామం తర్వాత ఇండియాలో ఒలింపిక్ సెషన్ జరుగుతోంది. భారతదేశంలో చివరి ఒలింపిక్ సెషన్ 1983లో న్యూఢిల్లీలో జరిగింది. 2029 యూత్ ఒలింపిక్స్‌కు…
solar eclipse: సూర్యగ్రహణం ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయం అయినప్పటికి హిందూ మంతంలో మాత్రం ఈ గ్రహణాలకి చాల ప్రాధాన్యత ఉంది. ఈ మాట ఇప్పుడు చెప్పుకోవడానికి గల కారణం.. ఈరోజు అంటే 14 అక్టోబర్ 2023న సూర్యగ్రహణం సంభవించనుంది. కాగా ఈ ఏడాదిలో ఇది రెండవ సూర్యగ్రహణం. శారదీయ నవరాత్రుల ప్రారంభానికి ఒక రోజు ముందు ఈ గ్రహణం ఏర్పడనుంది. అసలు సూర్యగ్రహణం అంటే ఏమిటి? ఈ ఈరోజు ఏర్పడే సూర్యగ్రహణం ఎక్కడెక్కడ ఏర్పడనుందో ఇప్పుడు…
Supreme Court: భారతీయ వివాహ వ్యవస్థలో విడాకులనేవి చాలా వరకు తక్కువ. ప్రతీ 100 వివాహాల్లో ఒక్కరు మాత్రమే విడాకుల వరకు వెళ్తున్నారు. హింస, క్రూరత్వం వంటి కేసుల్లో ఇటు మహిళలు, అటు పురుషులు విడాకులను కోరుతున్నారు. కోర్టు అన్ని సాక్ష్యాలను పరిశీలించి నిజం అని తేలితేనే విడాకులను మంజూరు చేస్తోంది. దంపతులు కలిసి ఉండేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. చిన్న చిన్న వివాదాలకు విడిపోవడాన్ని కోర్టులు ప్రశ్నించడం గతంలో చూశాం.
Manipur Violence: మణిపూర్ రాష్ట్రం గత నాలుగు నెలలుగా అల్లకల్లోలంగా ఉంది. మైయిటీ, కుకీ తెగల మధ్య వివాదం కారణంగా ఆ రాష్ట్రంలో 175 మంది పైగా మరణించారు. వేల సంఖ్యలో సొంత గ్రామాలను వదిలి వలసపోయారు. అయితే ఈ అల్లర్లలో కుట్ర దాగి ఉందని తెలుస్తోంది. బంగ్లాదేశ్, మయన్మార్ లోని కొన్ని ఉగ్రసంస్థలతో సంబంధం పెట్టుకున్న కొందరు మణిపూర్ వాసులు అల్లర్లు మరింత పెరిగేలా ప్లాన్ చేస్తున్నారు.