solar eclipse: సూర్యగ్రహణం ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయం అయినప్పటికి హిందూ మంతంలో మాత్రం ఈ గ్రహణాలకి చాల ప్రాధాన్యత ఉంది. ఈ మాట ఇప్పుడు చెప్పుకోవడానికి గల కారణం.. ఈరోజు అంటే 14 అక్టోబర్ 2023న సూర్యగ్రహణం సంభవించనుంది. కాగా ఈ ఏడాదిలో ఇది రెండవ సూర్యగ్రహణం. శారదీయ నవరాత్రుల ప్రారంభానికి ఒక రోజు ముందు ఈ గ్రహణం ఏర్పడనుంది. అసలు సూర్యగ్రహణం అంటే ఏమిటి? ఈ ఈరోజు ఏర్పడే సూర్యగ్రహణం ఎక్కడెక్కడ ఏర్పడనుందో ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది. దీని కారణంగా సూర్య కిరణాలూ భూమి పైన పడతాయి. అలా భూమి పైన పడిన కిరణాలు భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుని పైన పడతాయి. అందుకే వెన్నెల చల్లగా ఉంటుంది.
Read also:Leo: మొదటి పది నిముషాలు మిస్ అవ్వకండి… ప్లీజ్
అయితే కొన్నిసార్లు చంద్రుడు భూమికి సూర్యుడుకి మధ్యలో వస్తాడు. అలా చంద్రుడు భూమికి సూర్యునికి మధ్యలో వచ్చి తాత్కాలికంగా సూర్య కాంతి భూమి పైన పడడ్డాన్ని నిరోధిస్తాడు. దీన్నే సూర్యగ్రహణం అంటారు. కాగా సూర్యగ్రహణం ఏర్పడంలో నాలుగు రకాలు ఉన్నాయి. పాక్షిక సూర్యగ్రహణం, వార్షిక సూర్యగ్రహణం, సంపూర్ణ సూర్యగ్రహణం, సంకర సూర్యగ్రహణం. అయితే ఈ రోజు ఏర్పడనున్న సూర్యగ్రహణం వార్షిక సూర్యగ్రహణం. ఇందులో సూర్యుడు ఉంగరం ఆకారంలో ఆకాశంలో కనిపిస్తాడు. అందుకే దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. అయితే భారత్ లో ఈ సూర్యగ్రహణం కనిపించదు. ఇది కేవలం ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లోను, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, మధ్య అమెరికా మరియు దక్షిణ అమెరికాలోని వివిధ దేశాలలోని కొన్ని ప్రాంతాలలో ఈ గ్రహణం కనిపించనుంది. ఇది IST రాత్రి 11.29 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా దాదాపు ఐదు నిమిషాల పాటు కొనసాగుతుంది. అలానే IST రాత్రి 11.34 గంటలకు ముగుస్తుంది.