Supreme Court: “ఆ గుండె చప్పుడును మేం ఆపలేం”.. గర్భవిచ్ఛత్తిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: 26 వారాల గర్భాన్ని తొలగించాలన్న వివాహిత అభ్యర్థనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)ఇచ్చిన నివేదిక ఆధారంగా.. గర్భాన్ని తొలగించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. గర్భంలో ఉన్న శిశువుకు ఎలాంటి సమస్యలు లేవని పేర్కొంది. ‘‘గర్భధారణ 26 వారాల 5 రోజులు. గర్భం రద్దుకు అనుమతించడం అనేది మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టంలోని సెక్షన్లు 3,5 ఉల్లంఘించడమే అవుతుందని, తల్లికి కానీ, పిల్లాడికి కానీ ఎలాంటి సమస్యలు లేవని’’ సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు.
Read Also: Argentina: అబ్బాయిల వల్లే కాదు.. అమ్మాయిలు ఇన్ని పరుగులేంట్రా బాబు.. రికార్డు బద్దలు
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
‘‘మనం ఇప్పుడు గుండె చప్పుడు ఆపలేము’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం వివాహిత స్త్రీలు, అత్యాచారాల నుంచి బయటపడిన వారు, ఇతర సమస్యలు ఉన్న మహిళలు, వికలాంగులు, మైనర్ల వంటి వారిలో గర్భం రద్దు చేయడానికి గరిష్ట పరిమితి 24 వారాలు. గత విచారణలో పిటిషనరైన మహిళ తన గర్భాన్ని తీసేసేందుకు అనుమతించాలని అభ్యర్థించారు. ఇద్దరు పిల్లల తల్లినని, తాను డిప్రెషన్ తో బాధపడుతున్నానని, మూడో బిడ్డను పెంచే స్థితిలో లేనని మహిళ కోర్టుకు తెలిపింది.
అక్టోబర్ 9న ఇందుకు కోర్టు అనుమతించింది, అయితే అబార్షన్‌కు వ్యతిరేకంగా ఎయిమ్స్ వైైద్యుల బృందం ఇచ్చిన సలహాలను ఉటంకిస్తూ కేంద్రం ఈ ఆర్డర్ ని రీకాల్ చేయాలని కోరింది. జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గతంలో ఈ విషయంలో విభజన తీర్పును వెలువరించింది. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ఇంతకుముందు సదరు మహిళ అబార్షన్ కోసం ఎందుకు అనుమతి తీసుకోలేదని, ఆమె 26 వారాలుగా ఏం చేస్తోందని, మేము న్యాయపరమైన తీర్పు ద్వారా పిల్లల మరణానికి ఆర్డర్ ఇవ్వాలా..? అని సీజేఐ చంద్రచూడ్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!