కొంతగాలంగా ఉత్కంఠ రేపుతోన్న స్వలింగ వివాహాల చట్టబద్ధతపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. స్వలింగ వివాహానికి చట్టబద్ధత కల్పించలేమని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
దీపావళికి ముందు రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రైల్వే ఉద్యోగులకు వారి 78 రోజుల జీతంతో సమానంగా బోనస్ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల 11.07 లక్షల మంది జాతీయ రవాణా సంస్థలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
దేశ వ్యతిరేక కార్యకలాపాల కేసులో 'న్యూస్‌క్లిక్' వెబ్‌సైట్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యూస్‌క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ, హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తి హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.
మహిళల వివాహ వయస్సును ప్రస్తుత 18 నుంచి 21 ఏళ్లకు పెంచే బిల్లును పరిశీలించిన పార్లమెంటరీ కమిటీ తన నివేదికను సమర్పించేందుకు తాజాగా మూడు నెలల గడువును పొడిగించింది.
2008లో జరిగిన ఢిల్లీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్యకేసులో ఐదుగురు నిందితులను ఢిల్లీ కోర్టు బుధవారం దోషులుగా నిర్ధారించింది. హెడ్‌లైన్స్ టుడే న్యూస్ ఛానెల్‌లో జర్నలిస్టుగా పనిచేసిన విశ్వనాథన్, సెప్టెంబర్ 2008లో ఆఫీసు నుండి ఇంటికి వెళ్తుండగా ఆమె కారులోనే కాల్చి చంపబడ్డారు.
ఉజ్వల పథకం లబ్ధిదారులకు దీపావళి కానుకగా ఉచితంగా వంటగ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు ప్రకటించారు. బులంద్‌షహర్‌లో జరిగిన కార్యక్రమంలో రూ.632 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు.
కేంద్రం ఇప్పటికే ఉన్న నాలుగు రాష్ట్రపతి శౌర్య పతకాలను తక్షణమే అమల్లోకి వచ్చేలా ఒకే పతకంగా విలీనం చేసింది. ఇప్పుడు అది 'ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలంటరీ'గా పిలవబడుతుంది.
పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా తన ప్రభుత్వ బంగ్లాలో ఉండవచ్చని, దానిని ఖాళీ చేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం తెలిపింది.
Asaduddin Owaisi: స్వాతంత్య్రానికి ముందు దేశ విభజన గురించి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ విభజన జరగాల్సింది కాదని, చారిత్రక తప్పిదమని సోమవారం అన్నారు. హైదరాబాద్ లో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. చారిత్రత్మకంగా ఇది ఒకే దేశమని, దురదృష్టవశాత్తు విడిపోవాల్సి వచ్చిందని అన్నారు.