దేశంలో ఇటీవల భార్యాభర్తల మధ్య విడాకుల కేసులు ఎక్కువ అయిపోతున్నాయి. చాలా జంటలు పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే పెటాకులు అవుతున్నాయి. తాజాగా ఓ విడాకుల కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి శారీరక బంధాన్ని నిరాకరించడం కూడా క్రూరత్వమే అని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. విడాకుల విషయంలో హైకోర్టులో విచారణకు వచ్చిన ఓ కేసును విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. తనతో తన భార్య కలిసి ఉండటం…
భారత రాజకీయాల్లో ఒక మాట చాలా ప్రసిద్ధి. అదేంటంటే ఢిల్లీ రహదారి లక్నో నుంచే వెళుతుంది అని. దాని ప్రకారం ప్రస్తుత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయని. ఇంకో మాటలో చెప్పాలంటే యూపీని గెలవకుండా ఢిల్లీని గెలవలేరని అర్థం. ప్రజాభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ, ఎస్పీ మధ్యనే ప్రధాన పోటీ. బీజేపీ జాతీయ ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌కు పెద్ద పాత్ర ఉండకపోవచ్చు. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని…
సోషల్ మీడియాలో కచ్చా బాదమ్ పాటతో పల్లీల వ్యాపారి భుబన్ బద్యాకర్ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. అయితే అతడు రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్భూమ్‌లో తాను కొనుగోలు చేసిన సెకండ్ హ్యాండ్ కారును నేర్చుకుంటుండగా భుబన్ బద్యాకర్ ప్రమాదం బారిన పడ్డాడు. ఈ ఘటనలో బద్యాకర్ ఛాతీకి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు స్థానికంగా ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ధ్రువీకరించారు. కాగా కచ్చా బాదమ్…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI)కి కేంద్ర ప్రభుత్వం కొత్త ఛైర్‌పర్సన్‌ను నియమించింది. ప్రస్తుత ఛైర్మన్ అజయ్ త్యాగి ఐదేళ్ల పదవీ కాలం సోమవారం ముగుస్తున్నందున ఆ బాధ్యతలను సెబీ మాజీ సభ్యురాలు మాధవి పూరీ బుచ్‌కు అప్పగించింది. క్యాపిటల్ మార్కెటింగ్ రెగ్యులేటరీ సంస్థ అయిన సెబీకి ఛైర్‌పర్సన్‌గా ఓ మహిళను నియమించడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా మూడేళ్ల పాటు మాధవి పూరీ బుచ్ నియామకానికి…
యూపీలోని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పిల్లలను దత్తత తీసుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 ప్రకారం సింగిల్ పేరెంట్ కూడా పిల్లలను దత్తత తీసుకోవచ్చని తెలిపింది. యూపీలోని వారణాసికి చెందిన ట్రాన్స్‌జెండర్ 2000 డిసెంబర్ 16న ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. ఈ జంట తాజాగా ఓ బిడ్డను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో సంబంధిత అధికారులను సంప్రదించగా.. వాళ్లు వివాహ…
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన భారత్ భారతి భాషా మహోత్సవ్ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే అందాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. మన మూలాలు, సంస్కృతిని తెలియజెప్పి ముందుకు నడిపించే సారథే భాష అని పేర్కొన్నారు. భాష అనేది మన అస్థిత్వాన్ని చెప్పడమే కాకుండా ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. తరతరాలుగా మన పూర్వీకులు మన సంస్కృతిని మన భాషలోనే…
దాణా కుంభకోణం కేసులో బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఊహించని షాక్ తగిలింది. దాణా కుంభకోణానికి సంబంధించిన డోరండా ట్రెజరీ కేసులో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అంతేకాదు రూ. 60 లక్షల ఫీజు కూడా చెల్లించాలని రాంచీలోని సీబీఐ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. దాణా కుంభకోణానికి సంబంధించిన డోరండా ట్రెజరీ కేసులో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా పేర్కొంటూ గత…
మాతృభాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాతృభాషలో విద్యాబోధన చిన్నారుల మానసిక అభివృద్ధికి దోహద పడుతుందని పేర్కొన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మాతృభాషలో బోధన కొనసాగుతోందన్నారు. వైద్య, సాంకేతిక కోర్సులు సైతం మాతృభాషలో బోధించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేశారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రతిపాదించిన కార్యక్రమాల అమలుపైనా వెబినార్‌లో మోదీ ప్రసంగించారు. విద్యాశాఖకు సంబంధించి ఐదు అంశాలపై దృష్టిసారించినట్లు తెలిపారు. జాతీయ…
ఢిల్లీ ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్నారు ప్రవీణ్ ప్రకాష్. ఫిబ్రవరి 14 వరకు ఏపీ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయ్యారు. మళ్ళీ ఢిల్లీ రావడం సంతోషంగా ఉందన్న ఆయన తనకున్న అనుభవం ద్వారా రాష్ట్ర పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి నాకు ఇచ్చిన బాధ్యతను సమర్ధవంతంగా నెరవేరుస్తా అన్నారు. ప్రధాన మంత్రి గతి శక్తి యోజన లో భాగంగా తెలంగాణ లో 5…
ఇప్పటి వరకు ద్విచక్రవాహనాలపై ప్రయాణించే పెద్దలకు మాత్రమే హెల్మెట్ ధరించాలనే నియమం ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం తాజాగా మరిన్ని నిబంధనలను ప్రకటించింది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే చిన్నారులకు సైతం హెల్మెట్ను తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చిన్నారులకు కూడా వారి సైజు ప్రకారం హెల్మెట్లను తయారు చేయాలని హెల్మెట్ తయారీదారులను ఈ మేరకు ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల ప్రకారం.. ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే…