ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా మోలో డింగా ఆదివారం దిల్లీలో సమావేశమయ్యారు. భారత్-కెన్యాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మోదీ ఆయనకు హామీ ఇచ్చారు. ఇరుదేశాల నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఏపీ హైకోర్టులో ఉదయం 10:30 గం.లకు ఏడుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. న్యాయమూర్తులచేత ప్రమాణం చేయించనున్నారు సీజే జస్టిస్ పీకే మిశ్రా. జస్టిస్ కొనకంటి శ్రీనివాస్ రెడ్డి, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ…
హిజాబ్ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ముస్లిం విద్యార్థులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ మేరకు వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హిజాబ్ అంశంపై అంతిమ తీర్పు వచ్చే వరకు ఎవరూ మతపరమైన దుస్తులు ధరించి స్కూళ్లకు హాజరుకావొద్దంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ముస్లిం విద్యార్థులు సవాల్ చేశారు. అయితే హిజాబ్ అంశంపై తక్షణ విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కర్ణాటక హైకోర్టు నిర్ణయం తర్వాతే విచారణ చేపడతామని…
ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి పోరాటానికి దిగనున్నారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీని అన్నా హజారే తీవ్రంగా తప్పుబట్టారు. వెంటనే ఈ కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఫిబ్రవరి 14 నుంచి అమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. కొత్త మద్యం పాలసీ ప్రకారం సూపర్ మార్కెట్లలో, జనరల్ స్టోర్‌లలో మద్యాన్ని విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. Read Also: Petrol Prices: సామాన్యులకు…
అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ విడుదలై 50 రోజులు దాటుతున్నా ఇంకా ఈ సినిమా మేనియా తగ్గడం లేదు. ఇప్పటికే ఈ మూవీలోని బన్నీ డైలాగులు, మేనరిజంలు ఎంతో పాపులర్ అయ్యాయి. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలువురు పుష్ప సినిమాలోని డైలాగులు, మేనరిజంలు ట్రై చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. క్రికెటర్ల దగ్గర నుంచి సాధారణ వ్యక్తుల దాకా పలువురు పుష్ప సినిమాలోని డైలాగులు, సాంగ్స్‌తో రీల్స్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు.…
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మిషన్ 2024 లక్ష్యంగా పోరాటాలు చేస్తామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీపీఐ జాతీయ కార్యదర్శి అమర్‌జీత్‌కౌర్ ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని శ్రామికవర్గం, ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ప్రజలను రక్షించండి.. దేశాన్ని కాపాడండి’ అనే నినాదంతో మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. Read Also: కొత్త ఒక వింత .. ఈ ఆధార్ కార్డు ఉంటేనే…
ముచ్చింతల్‌లో నాలుగోరోజు రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజుల పాటు కొనసాగనున్న సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు కీలక ఘట్టాలు జరగనున్నాయి. వసంత పంచమి సందర్భంగా యాగశాలలో విష్వక్సేనేష్ఠి యాగం నిర్వహిస్తున్నారు. నేడు రామానుజాచార్యుల పంచలోహ విగ్రహాన్ని దేశ ప్రధాని నరేంద్రమోదీ లోకార్పణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పలు క్రతువుల్లో స్వల్ప మార్పులు చేశారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగా రెడ్డి మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న…
కరోనా నేపథ్యంలో గేట్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5 నుంచి గేట్ పరీక్షలు జరుగుతాయని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. షెడ్యూల్‌కు రెండు రోజుల ముందు పరీక్షలను రద్దు చేయడం విద్యార్థులను గందరగోళానికి, అనిశ్చితికి గురిచేస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం గేట్ పరీక్ష వాయిదాపై దాఖలైన పిటిషన్‌లపై…
దేశంలో గుణాత్మక మార్పు రావాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మార్పు కోసం ఏం చేయాలో అంతా చేస్తానని…ఈ అంశంపై అందరినీ కలుపుకుని వెళ్తానని కేసీఆర్ చెప్పారు. దీనిపై కొద్ది రోజుల్లోనే అన్ని విషయాలు ప్రకటిస్తానని తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను సెమీఫైనల్ అంటున్నారని… అయితే యూపీలో ఎవరు గెలిచినా ఈసారి బీజేపీకి సీట్లు అయితే తగ్గుతాయని కేసీఆర్ జోస్యం చెప్పారు. ఇది బీజేపీ పతనానికి నాంది పలుకుతుందన్నారు. దేశానికి కొత్త రాజ్యాగం కావాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం…
దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. పెగాసస్‌పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ విషయంలో భారత్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఒప్పందంపై దర్యాప్తు చేయాలని పిటిషనర్, న్యాయవాది ఎంఎల్ శర్మ కోరారు. ఈ ఒప్పందంలో పాల్గొన్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. పెగాసస్‌పై న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ప్రచురించిన వివరాలను ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. Read Also: ఔను .. భారత్ పెగాసిస్ కొనుగోలు…
సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం చేయనున్నారు. రాష్ట్రపతి హోదాలో పార్లమెంట్లో రామ్‌నాథ్ కోవింద్‌కు ఇదే చివరి ప్రసంగం కానుంది. ఎందుకంటే ఈ ఏడాది జూలైతో రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం ముగియనుంది. రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన అనంతరం.. లోక్‌సభ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక…