ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం కొలువుదీరింది. భగవంత్ మాన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ఆప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ క్రికెటర్ హర్భజన్‌కు రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఎమ్మెల్యే సీట్ల ప్రకారం తాజాగా ఆప్‌కు రెండు రాజ్యసభ స్థానాలు లభించే…
యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీలో నాలుగేళ్ల కోర్సు, 8 సెమిస్టర్ల విధానానికి యూజీసీ గురువారం నాడు ఆమోదం పలికింది. ఈ నాలుగేళ్లలో ఒక్కో సెమిస్టర్ కాల వ్యవధి 90 రోజులు ఉంటుంది. మొదటి మూడు సెమిస్టర్లలో మ్యాథ్స్, సోషల్, హ్యూమానిటీస్, వృత్తి విద్య వంటి సబ్జెక్టులు ఉంటాయని యూజీసీ తెలిపింది. మూడో సెమిస్టర్ ముగిసిన తర్వాత మేజర్, మైనర్ సబ్జెక్టులను విద్యార్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల ఆసక్తి, అప్పటివరకు విద్యార్థులు చూపిన…
తాను వివాహం చేసుకున్న మహిళ ఆడది కాదంటూ ఓ భర్త సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మెడికల్ రిపోర్టు ప్రకారం ఆమె ఆడది కాదని, తాను మోసపోయానని, ఆమె నుండి విడాకులు ఇప్పించాలంటూ పిటిషన్ ద్వారా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ వ్యక్తి విజ్ఞప్తి చేశాడు. 2016లో తమకు వివాహం అయిందని, ఆమె రుతుక్రమం కారణంగా తనకు దూరంగా ఉందని, అనంతరం ఆమె తన వద్దకు తిరిగి వచ్చిందని పిటిషన్‌లో భర్త పేర్కొన్నాడు. ఆమెతో…
ట్రాన్స్‌జెండర్లకు మన దేశంలో ప్రత్యేకమైన హక్కులున్నాయి. కానీ వారిని చాలా మంది చిన్నచూపు చూస్తుంటారు. ఉద్యోగాలలో తీసుకోవడానికి వెనుకాడుతుంటారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్ జెండర్లపై ఉన్న వ్యతిరేకత పోగొట్టే ఉద్దేశ్యంతో ముంబై వెర్సోవా ప్రాంతంలోని ఓ కేఫ్ వినూత్నంగా ఆలోచించింది. తమ కేఫ్‌లో పనిచేసే ఉద్యోగులుగా ట్రాన్స్‌జెండర్లనే నియమించుకుంది. ఈ కేఫ్ పేరు బాంబాయ్ నజారియా. ఈ కేఫ్ మోటో ‘నజారియా బదలో.. నజారా బద్‌లేగా’. అంటే ముందు నువ్వు మారు.. ఆ తర్వాత ఈ ప్రపంచమే…
భారత్ అమ్ములపొదిలో మరో శక్తివంతమైన క్షిపణి చేరనుంది. బ్రహ్మోస్ క్షిపణి ఇప్పటివరకు 300 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను మాత్రమే చేధించగలదు. అయితే త్వరలోనే 800 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్న శత్రు లక్ష్యాలను ఛేదించగల బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్ అభివృద్ధి చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ శక్తివంతమైన క్షిపణిని గగనతలం నుంచి ప్రయోగించే విధంగా నిర్మిస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా ఇటీవల బ్రహ్మోస్ క్షిపణి సాంకేతిక లోపం కారణంగా పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన సంగతి…
జమ్ము కాశ్మీర్ పుల్వామాలో అలజడి రేగింది. భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాది హతం అయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశాయి భద్రతా బలగాలు. మరికొందరి కోసం గాలింపు ముమ్మరం సాగుతోంది. ఇంకా ఉగ్రవాదులు వున్నారని భద్రతా బలగాలు చెబుతున్నాయి. కాల్పులు ఇంకా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. పుల్వామాలోని నైనా బట్‌పోరాలో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్‌ను నిర్వహించాయి. రెండురోజుల క్రితం ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ప్రస్తుతం ఇంకా ఎన్‌కౌంటర్…
నేడు ఢిల్లీకి ఆప్ పంజాబ్ సీఎం అభ్యర్ధి భగవంత్ మాన్ నేడు శాసనసభలో ఏపీ వార్షిక బడ్జెట్ ఇవాళ ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ. 2022-23 బడ్జెట్ ఆమోదానికి సమావేశం. ఇవాళ్టి నుంచి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభం. నల్లగొండ జిల్లా కొండపాకగూడెం నుంచి పాదయాత్ర. ఏపీలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా ఏపీలో ఉదయం 11 గంటలకు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి కన్నబాబు నేడు బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ సవాల్…
దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అన్ని పార్టీలు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో రాజకీయ అభ్యర్థుల భవితవ్యం ఈనెల 10న తేలిపోనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌లో లడ్డూలకు బాగా గిరాకీ ఏర్పడింది. ఎన్నికల ఫలితాలకు ముందు పలు రాజకీయ పార్టీల నుంచి లడ్డూల కోసం ఆర్డర్లు పోటెత్తాయి. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు సంబరాల్లో భాగంగా మిఠాయిలు పంచుకోవడం మాములే. దీంతో విజయంపై ధీమాతో పలు రాజకీయ…
తమిళనాడు మంత్రి శేఖర్‌బాబు కుమార్తె జయకళ్యాణి ప్రేమ వివాహం చేసుకుంది. బెంగళూరులోని హిందూ ధార్మిక సంస్థలో సోమవారం నాడు సతీష్అనే యువకుడితో మంత్రి కుమార్తె వివాహం జరిగింది. తమ ప్రేమకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇలా ప్రేమ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని జయకళ్యాణి వివరణ ఇచ్చింది. అయితే తన తండ్రి నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఆమెతో పాటు ఆమె భర్త సతీష్ పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. కొన్ని నెలల క్రితం…
మహారాష్ట్రలో రెండో అతి పెద్దనగరం పూణెలో మెట్రోరైలు సేవలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ ఆదివారం నాడు పూణె మెట్రోరైలు ప్రాజెక్టును ప్రారంభించారు. తొలుత పుణె మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. 9.5 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని పూణె మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అనంతరం గర్వారే మెట్రో స్టేషన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపి పూణె మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా…