* ఇవాళ ఉదయం 9.05 – 9.45 నిమిషాలకు క్యాంప్ కార్యాలయం నుంచి 26 జిల్లాలను వర్చువల్‌గా లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్. *మారనున్న ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం. 26 జిల్లాల రాష్ట్రంగా కొత్త రూపు. 42 ఏళ్ళ తర్వాత రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు. చివరిసారిగా 1979లో ఏర్పడిన విజయనగరం జిల్లా. *నేడు కోనసీమ జిల్లా వ్యాప్తంగా బ్లాక్ డే. అమలాపురం కేంద్రంగా ఏర్పాటైన కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును…
కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ ఉత్పత్తిని క్రమంగా తగ్గిస్తున్నట్లు భారత్ బయోటెక్ కంపెనీ శుక్రవారం వెల్లడించింది. టీకా ఒప్పంద కంపెనీలకు సరఫరా పూర్తి కావడం, టీకాకు డిమాండ్ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. మరోవైపు వైరస్ వ్యాప్తి తగ్గడం, దాదాపు అందరూ వ్యాక్సిన్ తీసుకోవడంతో కరోనా టీకాలకు డిమాండ్ తగ్గినట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో టీకా తయారీ కేంద్రాల నిర్వహణ పనులు చేపడతామని.. ఈ సదుపాయాలను మరింత సమర్థంగా వినియోగించే ప్రక్రియలపై దృష్టి…
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటాకు భారత రత్న అవార్డు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జీవితాంతం అవిశ్రాంతంగా సేవలను అందిస్తున్న రతన్‌టాటా భారతరత్న అవార్డుకు అర్హుడంటూ సామాజిక కార్యకర్త రాకేష్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ పిటిషన్‌ను విచారించేందుకు హైకోర్టు తిరస్కరించింది. ఓ వ్యక్తికి దేశ అత్యున్నత అవార్డు భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వ అధికారులను తాము ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయినా అసలు…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసోం, మణిపూర్, నాగాలాండ్‌లో వివాదాస్పదంగా మారిన సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని కుదిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. AFSPA (ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్) పేరుతో ఈ చట్టాన్నిఈశాన్య రాష్ట్రాలలో తిరుగుబాటు దారుల అణిచివేత కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చింది. అయితే భద్రతా దళాలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చట్టం పరిధిలోని ప్రాంతాలను…
మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆస్తులు చూసి అధికారులు షాకయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఘాటిగావ్‌కు చెందిన ప్రశాంత్ పర్మార్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో టీచర్‍గా పనిచేస్తున్నాడు. అతడి నెల జీతం వేలల్లో మాత్రమే ఉంటుంది. అయితే అతడు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు సమాచారం అందడంతో అధికారులు సోదాలు నిర్వహించారు. ఏక కాలంలో అతడి నివాసంతో పాటు ఇతర ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే ఈ సోదాల్లో ప్రశాంత్ పర్మార్ ఆస్తుల జాబితా అధికారులను అవాక్కయ్యేలా చేసింది. ప్రశాంత్…
మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కాసేపటికే బీరెన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వారంలో ఐదురోజులే పనిదినాలు ఉండేలా కొత్త జీవో విడుదల చేశారు. ఈ నిర్ణయంతో మణిపూర్‌లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని చేయనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. మార్చి నుంచి అక్టోబరు వరకు ఉదయం 9…
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. సోమవారం నాడు సభలో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం మమతా బెనర్జీ ప్రకటన చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. ముఖ్యంగా బీర్బూమ్ ఘటనపై సీఎం మమత మాట్లాడాలని బీజేపీ నేతలు పట్టుబట్టడం టీఎంసీ ఎమ్మెల్యేలకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఇటీవల బీర్బూమ్‌లో టీఎంసీ నేత…
కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గత రెండేళ్లుగా దేశంలో టెలికాం ఆపరేటర్లు ప్రవేశపెట్టిన కాలర్ ట్యూన్‌లు ఎట్టకేలకు నిలిచిపోనున్నాయి. ఎప్పుడూ కాల్ చేసినా ‘కరోనాపై పోరాటంలో మనం పోరాడాల్సింది రోగితో కాదు వ్యాధితో’ అంటూ వినిపించే కాలర్ ట్యూన్‌లతో ప్రజలు విసిగెత్తిపోయారు. ఈ కాలర్‌ట్యూన్ సెల్‌ఫోన్ వినియోగదారులకు పలు సందర్భాల్లో చికాకు కూడా తెప్పించేది. అయితే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో టెలికాం ఆపరేటర్లు ఈ కాలర్ ట్యూన్‌ను త్వరలో తొలగించనున్నారు. ఈ కాలర్ ట్యూన్ కారణంగా…
దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాల్లో అమర్నాథ్ ఒకటి. హిమాలయాల్లో కొలువుదీరే ఈ మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షల మంది భక్తులు తరలి వెళ్తుంటారు. వేసవిలో తప్ప మిగతా సమయంలో ఇక్కడ మంచు కప్పబడి ఉంటుంది. దీంతో వేసవిలో కొన్ని రోజులు మాత్రమే ఇక్కడి మంచులింగాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో పరమేశ్వరుడి భక్తుల నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాది అమర్నాథ్…