దేశంలో ఎక్కడో చోట ప్రతీ రోజు అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలన కలిగించింది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వాలు నిర్భయ, దిశ, పోక్సో వంటి చట్టాలను అమలులోకి తెచ్చినా కూడా కామాంధుల తీరులో మార్పు రావడం లేదు. వావీ వరస, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కామాంధులు బరి తెగిస్తున్నారు. ఢిల్లీలో నిర్భయ…
సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పై గృహ వినియోగదారులకు ఇస్తున్న సబ్సిడీని తొలగించింది. ఇకపై గ్యాస్ సబ్సిడీని కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన లబ్ధిదారులకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో సామాన్యులు మార్కెట్ ధరకే గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కరోనా తర్వాత సామాన్యులకు అంతంత మాత్రంగానే గ్యాస్ సబ్సిడీ పడుతోంది. ఇప్పుడు పూర్తిగా ఎత్తివేయడంతో గ్యాస్ సిలిండర్…
దేశంలోని ఖాళీగా ఉన్న 57 రాజ్యసభ స్థానాలకు బీజేపీ ఆదివారం నాడు తన తొలి జాబితాను ప్రకటించింది. వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభ అభ్యర్థులను ఆ పార్టీ బరిలో దించుతోంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. మరో కేంద్రమంత్రి పియూష్ గోయల్‌కు మహారాష్ట్ర నుంచి అవకాశం కల్పించారు. రాజ్యసభలో ఖాళీ అయిన 57 స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి. Sidhu Moose Wala: పంజాబీ సింగర్ దారుణ హత్య కర్ణాటక…
కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ నిష్క్రమణ కాంగ్రెస్ పార్టీ, దాని న్యాయ బృందం (లీగల్ టీమ్)కు పెద్ద దెబ్బ. విజయవంతమైన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ కపిల్ సిబల్ బుధవారం కాంగ్రెస్ పార్టీని వీడటం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. అనేక న్యాయ పోరాటాలలో గత ముప్పయ్ ఏళ్లుగా ఆయన పార్టీకి బలమైన గొంతుకగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం సుప్రీంకోర్టులో చురుకైన పాత్ర పోషించారు. పౌరసత్వ(సవరణ) చట్టం, గోప్యత హక్కు, మరాఠా కోటా, జహంగీర్‌పురి కూల్చివేత వంటి…
పంజాబ్‌లో ఇటీవలే ఆప్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ మేరకు కొత్త కేబినెట్‌లో ఆప్ నేత విజయ్ సింఘ్లాకు ఆరోగ్య శాఖను సీఎం భగవంత్ మాన్‌సింగ్ కట్టబెట్టారు. అయితే రెండు నెలలు తిరగకముందే మంత్రి పదవిని విజయ్ సింఘ్లా దుర్వినియోగం చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆరోగ్య శాఖకు సంబంధించి వివిధ కాంట్రాక్టుల కోసం మంత్రి విజయ్ సింఘ్లా ఒక శాతం కమిషన్ అడుగుతున్నారని ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీఎం భగవంత్…
అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో వరద బీభత్సానికి ఎంతోమంది నిరుపేదలు తమ గూడును, నీడను కోల్పోయారు. వరదలు కొనసాగుతుండటంతో 26 జిల్లాలోని 1089 గ్రామాలు నీట మునిగాయి. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు.భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చిన గ్రామాల్లో పర్యటించడానికి అసోం బీజేపీ ఎమ్మెల్యే సిబుమిశ్రా వెళ్లారు. ఈ నేపథ్యంలో ఓ చోట కేవలం పాదం మునిగేంత నీరు మాత్రమే ఉంది. కానీ ఆ వరద నీటిలో నడిచేందుకు…
పాట్నాలో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే దారుణ ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే, కామంతో కళ్ళు మూసుకుపోయి కూతురిపై అత్యాచారానికి తెగబడ్డాడు. తండ్రి పెట్టే హింసల్ని తాళ్ళలేక, ఆ వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనని కాపాడని పోలీసుల్ని వేడుకుంది. పోలీసులకు ఆ వీడియో చేరడంతో, వెంటనే రంగంలోకి దిగి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. బీహార్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు(50) సమస్తిపూర్‌లోని రోసెరా ప్రాంతంలో…
తమిళనాడులో సీఎం స్టాలిన్ అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతోంది. గత ఏడాది మే 7న డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత తమిళనాడులో డీఎంకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ ప్రభుత్వ బస్సులో ప్రయాణించారు. మెరీనా బీచ్‌లో ఉన్న తన తండ్రి కరుణానిధి స్మారక చిహ్నం అన్నా మెమోరియల్‌కు బస్సులో వెళ్తూ ప్రయాణికులు, కండక్టర్‌తో ముచ్చటించారు. డీఎంకే పాలన ఎలా ఉందని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్టాలిన్ స్వయంగా…
బీహార్ రాష్ట్రంలోని గయాలో నివసించే ఆ కుటుంబానికి పక్షులను పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. పక్షులను కూడా సొంత బిడ్డల తరహాలో అపురూపంగా చూసుకుంటారు. అయితే కొన్నిరోజులుగా శ్యామ్‌దేవ్ ప్రసాద్ గుప్త, సంగీత గుప్త దంపతులు పెంచుకుంటున్న చిలుక కనిపించకుండా ఎటో వెళ్లిపోయింది. దీంతో ఆ కుటుంబం నానా హైరానా పడుతోంది. తాము అనేక రకాలుగా ప్రయత్నించినా చిలుక కనపడలేదని శ్యామ్‌దేవ్ ప్రసాద్ గుప్త దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ చిలుక కనిపించడం…
దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినా..అక్కడక్కడా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో అప్రమత్తంగా వుండాలంటున్నారు నిపుణులు. ఇదిలా వుంటే పిల్లల వ్యాక్సినేషన్ సురక్షితమేనని నిపుణులు విశ్లేషించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తన కీలక తీర్పు వెల్లడించింది. నిపుణులు తమ అభిప్రాయం చెప్పాక తాము నిర్ణయాన్ని వెలువరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలో పిల్లలకు కొవిడ్ టీకాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. శాస్త్రీయ ఏకాభిప్రాయం, ప్రపంచ సాధికార సంస్థల సూచనలకు అనుగుణంగానే ఉన్నట్లు…