Terror threat: జమ్మూ కాశ్మీర్‌లోని జైళ్లపై ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆయా జైళ్ల దగ్గర భద్రతాను భారీగా పెంచేశారు. శ్రీనగర్ సెంట్రల్ జైలు, జమ్మూలోని కోట్ బల్వాల్ జైలు వంటి వాటికి ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు సూచించాయి.
Human Trafficking In Bangladeshi Girls: బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు పెంచారు. హైదరాబాద్ నగరంలోని బండ్లగూడలో నమోదైన కేసులో ఆస్తులను అటాచ్ చేసింది.
NIA Raids: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈ ఉదయం తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తుంది. చెన్నై, మైలాడుతురై సహా 25 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.
America: అమెరికాలోని ఖలిస్థానీ ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ యొక్క బ్యాంకు వివరాలను భారత్‌కు ఇవ్వడం కుదరదు అని అక్కడి పోలీసులు తెలిపారు.
Delhi Police: ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సీఆర్‌పీఎఫ్ స్కూల్ దగ్గర ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనకు ఖలిస్తాన్ వేర్పాటవాదులకు ఉన్న లింక్‌ను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇక, అంశంపై తాజాగా ‘జస్టిస్ లీగ్ ఇండియా’ పేరుతో ఉన్న టెలిగ్రామ్ ఛానెల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని దర్యాప్తు టీమ్ ఆ లేఖలో కోరింది.
NIA Rides On Jaish-e-Mohammad: పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సానుబుతిపరులపై దర్యాప్తు భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (NIA) శనివారం 5 రాష్ట్రాల్లోని 22 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అస్సాం, ఢిల్లీలో దాడులు నిర్వహించారు. మహారాష్ట్రలోని మాలెగావ్ లోని హోమియోపతి క్లినిక్‌పై ఎన్‌ఐఏ బృందం దాడులు చేసింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, కుట్రకు సంబంధించిన ప్రధాన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దేశవ్యాప్తంగా విస్తృత దాడులు ప్రారంభించింది.…
Reasi Bus Terror Attack : జమ్మూకశ్మీర్‌లోని రియాసి బస్సు దాడికి సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈరోజు రెండు జిల్లాల్లోని ఏడు చోట్ల సోదాలు నిర్వహిస్తోంది.
పంజాబ్‌లో, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్, అతడి సహచరులకు సంబంధించిన 9 ప్రదేశాలపై దాడులు చేసింది. దోపిడీ, కాల్పుల కేసుకు సంబంధించిన కేసులో రైడ్ నిర్వహించిన ఎన్ఐఏ డిజిటల్ పరికరాలతో సహా అభ్యంతరకరమైన వస్తువులు, ఆయుధాలను స్వాధీనం చేసుకుంది.