ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో కీలక చర్యలు తీసుకుంటూ.. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని 9 ప్రాంతాల్లో సోదాలు చేస్తుంది. ఈ దాడిలో ఎన్‌ఐఏ అధికారులతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మేదినీపూర్ జిల్లాలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) బృందంపై దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత, ఆ బృందం అర్ధరాత్రి తర్వాత దాడులకు ఎందుకు వచ్చిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. వేళకాని సమయాల్లో దాడులు చేయడానికి అవసరమైన అనుమతి బృందానికి ఉందా అని కూడా ముఖ్యమంత్రి ప్రశ్నించారు. “అర్ధరాత్రి వారు ఎందుకు దాడి చేశారు..? వారు పోలీసుల నుండి అనుమతి తీసుకున్నారా..? అర్ధరాత్రి ఎవరైనా అపరిచితుడు ఆ ప్రదేశానికి వస్తే స్థానికులు…
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గుర్తించింది. నిందితుడు ఈ ఏడాది జనవరిలో చెన్నైలో నివసించినట్లు కూడా గుర్తించారు. నిందితుడిని ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్‌గా గుర్తించినట్లు వారు తెలిపారు.
బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి లష్కరే తోయిబా తీవ్రవాదులు పరారీ కేసులో దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 17 చోట్ల ఎన్‌ఐఏ సోదాలు చేస్తోంది. ఢిల్లీ, ముంబయి, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో పాటు మరో రెండు రాష్ట్రాల్లోని 17 చోట్ల ఎన్‌ఐఏ బృందాలు సోదాలు చేస్తున్నాయి.
ఉగ్రవాద కుట్ర కేసులో దక్షిణ కశ్మీర్‌లోని ఐదు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం సోదాలు నిర్వహించింది. ఈ ఏడాది మేలో జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్, షోపియాన్, పుల్వామా, శ్రీనగర్, అనంత్‌నాగ్ జిల్లాల్లోని 13 ప్రాంతాల్లో కూడా ఎన్‌ఐఏ భౌతిక, సైబర్‌స్పేస్ ద్వారా ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నిన కేసులో సోదాలు నిర్వహించింది.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా, షోపియాన్‌లలో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో దర్యాప్తులో భాగంగా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. ఈ కేసు పాకిస్థాన్ కమాండర్లు లేదా హ్యాండ్లర్ల ఆదేశానుసారం వివిధ నకిలీ పేర్లతో పనిచేస్తున్న టెర్రర్ గ్రూపులు, టెర్రర్ ఫండింగ్, నేరపూరిత కుట్రకు సంబంధించినది.
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)ని లక్ష్యంగా చేసుకుని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) మంగళవారం ఉదయం నాలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి.
గ్యాంగ్‌స్టర్లపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఉక్కుపాదం మోపుతోంది. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. గ్యాంగ్‌స్టర్లు, టెర్రర్ గ్రూపులు, డ్రగ్స్ మాఫియా మధ్య సంబంధానికి సంబంధించిన కేసులకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఎనిమిది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తోందని అధికారులు తెలిపారు.