RBI Governor on CryptoCurrencies: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతదాస్ ఇటీవల ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అసలు వాటి వల్ల దేశానికి, ప్రజలకు ఏంటి ఉపయోగం అని నిలదీశారు. పైసా కూడా ప్రయోజనంలేని ఇలాంటివాటిని ఇంకా ప్రోత్సహిస్తే మరో ఘోర ఆర్థిక మాంద్యానికి దారితీయక తప్పదని హెచ్చరించారు. తన మాటలను రాసిపెట్టుకోవాలని, క్రిప్టో కరెన్సీలకు ముకుతాడు వేయకపోతే తాను చెప్పింది జరిగి తీరుతుందని బల్ల గుద్ది చెప్పారు.
India in World Steel Production: ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ఉత్పత్తిలో ప్రస్తుతం మన దేశమే నంబర్-2 పొజిషన్‌లో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గడచిన 8 ఏళ్లలో స్టీల్ ప్రొడక్షన్ రెట్టింపైందని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాజ్యసభలో వెల్లడించారు. ఇండియా చరిత్రలో ఎప్పుడూ ఈ స్థాయిలో పురోగతి చోటుచేసుకోలేదని చెప్పారు. 2013-14లో ఏడాదికి 6 కోట్ల టన్నుల ఉక్కును మాత్రమే ఉత్పత్తి చేసేవాళ్లం.
New Year 2023: ఇండియాలో గతేడాది 46 కంపెనీలు యూనికార్న్ హోదా పొందగా ఈ సంవత్సరం 22 సంస్థలే ఈ స్టేటస్ సాధించాయి. అంటే కొత్త యూనికార్న్‌ల సంఖ్య సగం కన్నా తక్కువకు పడిపోయింది. అయితే.. ఫ్యూచర్ యూనికార్న్‌లు ఈ ఏడాది భారీగానే పెరిగాయి. ఈ విషయాలను రెండు వేర్వేరు సంస్థల నివేదికలు వెల్లడించాయి. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా అమెరికా మరియు చైనా తర్వాత 3వ అతిపెద్ద స్టార్టప్స్ అండ్ యూనికార్న్స్ ఎకోసిస్టమ్‌గా ఇండియా ఎదగటం విశేషం.
Indian Economy Growth in 2023: వచ్చే సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ సగటు వృద్ధిని అధిగమించగలదని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. 2023లో మూలధన ఖర్చులు పుంజుకోవటం, వినియోగ సామర్థ్యం అధికం కావటం మరియు మౌలిక రంగంలో ప్రభుత్వ వ్యయం పెరగటం వంటివి ఈ దిశగా కీలక పాత్ర పోషించనున్నాయని చెబుతున్నారు. గ్లోబల్ ఎకానమీ పరిస్థితులు మన ఆర్థిక వ్యవస్థకు ఆటంకాలు కలిగించనున్నప్పటికీ వృద్ధి మాత్రం 4.8 శాతం నుంచి 5.9 శాతం వరకు ఉండొచ్చని…
Vodafone Idea is Losing Customers: ‘వన్ ఐడియా కెన్ ఛేంజ్ యువర్ లైఫ్’ అంటూ ఆకట్టుకునే ప్రచారంతో దూసుకొచ్చిన టెలికం సంస్థ ఐడియా. ఈ కంపెనీ సిమ్ కార్డ్ తీసుకోవటం వల్ల మన జీవితాలు మారిపోవటం సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు ఆ సంస్థ జీవితమే తిరోగమనంలో పయనిస్తోంది. వొడాఫోన్-ఐడియాకి ప్రతి నెలా లక్షల సంఖ్యలో కస్టమర్లు తగ్గిపోతున్నారు. లేటెస్ట్‌గా అక్టోబర్‌లో 35 లక్షల మంది గుడ్‌బై చెప్పేశారు.
India Growth: మన దేశం వచ్చే ఏడాది 5 శాతం గ్రోత్ సాధించినా గొప్ప విషయమేనని, అదే జరిగితే మనం అదృష్టవంతులమేనని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్ అన్నారు. ఈ ఏడాదితో పోల్చితే వచ్చే సంవత్సరం మరింత కష్టంగా గడవనుందని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి వేగం మందగించబోతోందని అంచనా వేశారు. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుకుంటూపోతున్నాయని, అందుకే గ్రోత్ పడిపోనుందని అభిప్రాయపడ్డారు.
Today(20-12-22) Stock Market Roundup: ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ నిన్న సోమవారం శుభారంభమైనప్పటికీ ఇవాళ మంగళవారం మళ్లీ నష్టాల బాట పట్టింది. లాభం అనేది ఒక్క రోజు ముచ్చటగానే మిగిలిపోయింది. ఈ రోజు మొత్తం లాస్‌లోనే నడిచింది. సెన్సెక్స్ 103 పాయింట్లు కోల్పోయి 61 వేల 702 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 32 పాయింట్లు తగ్గి 18 వేల 388 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం 50 స్టాక్స్‌లో 39 స్టాక్స్‌కి…
Record Level Cars Sales: రోజులు మారాయి. పెళ్లిళ్ల రేంజ్ కూడా పెరిగింది. అత్తింటివారు కొత్తల్లుడికి కట్నం కింద కార్లు ఇస్తున్నారు. ఒకప్పుడు మ్యారేజ్‌కి గిఫ్ట్ రూపంలో ఎక్కువగా లేటెస్ట్ మోడల్ బైక్‌లు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ ఛేంజ్ అయింది. నూతన వధూవరులకి కాస్ట్‌లీ కానుకలుగా కార్లు బహూకరించేవారి సంఖ్య ప్రతి సంవత్సరంగా భారీగా వృద్ధి చెందుతోంది. దీంతో కార్ల విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గతేడాది నవంబర్‌తో పోల్చితే ఈ సంవత్సరం నవంబర్‌లో కార్ల…
Small Loans-Better Payments: ‘‘చిన్న కుటుంబం.. చింతల్లేని కుటుంబం..’’ అంటారు కదా. ఆ మాటను.. బ్యాంక్ లోన్లకు కూడా వర్తింపజేయొచ్చనిపిస్తోంది. ఎందుకంటే.. చిన్న మొత్తాల్లో రుణాలు తీసుకున్నవాళ్లు చెల్లింపులను తూచా తప్పకుండా చేస్తున్నారు. ముద్ర అనే కేంద్ర ప్రభుత్వ పథకం కింద లోన్లు తీసుకున్న కస్టమర్లను దీనికి ఉదాహరణగా చూపొచ్చు. 2015లో ప్రారంభించిన ఈ స్కీమ్‌లో భాగంగా 3 రకాల రుణాలు మంజూరు చేస్తారు.
No Change in Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఈరోజు శుక్రవారం కూడా దాదాపు నిన్నటి సీనే రిపీటైంది. ఇవాళ మొత్తం దాదాపుగా నష్టాల బాటలోనే సాగింది. ఎర్లీ ట్రేడింగ్‌లో కొద్దిసేపు లాభాల్లోకి వచ్చినా ఆ ఆనందం ఆదిలోనే ఆవిరైంది. అంతర్జాతీయ పరిస్థితులు ప్రతికూల ప్రభావం చూపాయి. అమెరికా మాదిరిగానే ఐరోపా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచటం వల్ల విదేశాల నుంచి నిధుల ప్రవాహం తగ్గుముఖం పట్టడం బాగా మైనస్ అయింది.