Reliance Industries-Naphtha Sale: నాఫ్తా అనేది మండే స్వభావం గల ద్రవ హైడ్రోకార్బన్ మిశ్రమం. సహజ వాయువును ఘనీభవనానికి గురిచేయటం ద్వారా దీన్ని ఉత్పత్తి చేస్తారు. పెట్రోలియాన్ని స్వేదనం చెందించటం వల్ల కూడా తయారుచేస్తారు. బొగ్గు తారును మరియు పీట్‌ను కలిపి స్వేదన ప్రక్రియకు లోను చేయటం ద్వారా సైతం నాఫ్తాను సంగ్రహించొచ్చు. వివిధ పరిశ్రమల్లో మరియు ప్రాంతాల్లో నాఫ్తాను ముడి చమురు లేదా కిరోసిన్ వంటి శుద్ధి చేసిన ఉత్పత్తుల మాదిరిగా కూడా వాడతారు.
Tata-Bisleri: మంచి నీళ్ల సీసాకు మారుపేరుగా నిలిచిన బిస్లెరీ కంపెనీ.. అమ్మకానికి వచ్చిందనే టాక్ ఇటీవల వినిపించింది. ఈ మాట ఆ నోటా ఈ నోటా పడి చివరికి సంస్థ అధిపతి రమేష్ చౌహాన్ కి చేరటంతో ఆయన స్పందించారు. అలాంటిదేం లేదంటూ ఖండించారు. అయితే.. ఇది పెద్ద విషయం కాదు. అసలు.. బిస్లెరీని కొనుగోలు చేసే కంపెనీ ఏది, ఎంత చెల్లించి సొంతం చేసుకోబోతోంది అనేవి హాట్ టాపిక్ అయ్యాయి. టాటా కంపెనీ 7 వేల…
Air india-Vistara: విస్తార ఎయిర్‌లైన్స్.. టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియాలో విలీనం కానుందని సింగపూర్ ఎయిర్‌లైన్స్ రీసెంట్‌గా ప్రకటించింది. విస్తారలో టాటా గ్రూప్‌కి మెజారిటీ షేరు.. అంటే.. 51 శాతం వాటా ఉండగా మిగతా 49 శాతం వాటాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ కలిగి ఉంది. ఇదిలాఉండగా.. సింగపూర్ ఎయిర్‌లైన్స్.. ఎయిరిండియాలో 25 పాయింట్ 1 శాతం షేరును దక్కించుకునేందుకు 2 వేల 58 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టనుంది.
Indian Smart Watch Market: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 3వ త్రైమాసికంలో మన దేశం మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌వాచ్ మార్కెట్‌గా అవతరించింది. ఇండియన్ స్మార్ట్‌వాచ్ మార్కెట్ ఏకంగా 171 శాతం గ్రోత్‌ను నమోదు చేసింది. ఇది గతేడాదితో పోల్చితే 30 శాతం ఎక్కువ కావటం చెప్పుకోదగ్గ విషయం. ఈ వృద్ధికి ముఖ్యంగా బేసిక్ స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్ దోహపడింది.
India Wanted Pilots: విమానయాన రంగం అభివృద్ధి దిశగా రెక్కలు తొడిగి రెప రెప లాడుతుండటంతో ఇండియాకి ఏటా వెయ్యి మందికి పైగా పైలట్లు అవసరమనే అంచనాలు వెలువడుతున్నాయి. వచ్చే ఐదేళ్లపాటు పైలట్లకు ఇదే స్థాయిలో డిమాండ్ నెలకొంటుందని చెబుతున్నారు. అయితే మన దేశానికి అవసరమైన సంఖ్యలో పైలట్లకు శిక్షణ ఇవ్వటానికి సరిపోను మౌలిక వసతులు లేవని నిపుణులు అంటున్నారు.
ONDC Network: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన ‘‘ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్’’లోకి షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ Shiprocket చేరింది. తద్వారా ఈ పరిధిలోకి వచ్చిన తొలి ఇంటర్-సిటీ లాజిస్టిక్స్ ప్రొవైడర్ గా నిలిచింది. ఈ మేరకు ఈ నెల 22న తొలి లావాదేవీని విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో ఇకపై అన్ని సెగ్మెంట్లకు సంబంధించిన విక్రయదారులు తమ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ఉన్న సిటీలకు, టౌన్లకు చేరవేసే వీలు కలిగింది.
5G Towers: టెలీకమ్యూనికేషన్ కంపెనీలు ప్రస్తుతం వారానికి 2 వేల 5 వందల 5జీ టవర్లను మాత్రమే ఏర్పాటుచేస్తుండగా ఆ సంఖ్యను వారానికి కనీసం 10 వేలకు పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఇప్పటివరకు మొత్తం 8 వేల టవర్లను మాత్రమే ఇన్‌స్టాల్ చేశారని, 5జీ మౌలిక సదుపాయాల ఏర్పాటులో టెల్కోలకు ప్రభుత్వం నుంచి పాలసీకి సంబంధించిన ఎలాంటి సపోర్ట్ కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
Indian Space Congress-2022: స్పేస్ టెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఇండియన్ స్పేస్ కాంగ్రెస్-2022 ప్రత్యేక చొరవ చూపుతోంది. వాటిని 1.5 ట్రిలియన్ డాలర్ల స్పేస్ ఎకానమీలో భాగస్వాములను చేసేందుకు పలు కార్యక్రమాలను ప్రకటించింది. షార్ట్ లిస్ట్ చేసిన 15 స్టార్టప్‌లకు ఫౌండర్స్ హబ్ ప్రయోజనాలను అందించనుంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆ స్టార్టప్‌లు లక్షన్నర డాలర్ల వరకు విలువ చేసే ఉచిత అజూర్ క్రెడిట్‌ల కోసం అప్లై చేసుకోవచ్చు.
Coca Cola Sprite: మన దేశ మార్కెట్‌లో కోకాకోలా స్ప్రైట్ కూల్‌డ్రింక్.. స్పెషల్ ఫీట్‌ను సాధించింది. ఒక బిలియన్ (వంద కోట్ల) డాలర్ల బ్రాండ్‌గా ఎదిగింది. జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో భారత మార్కెట్‌లో స్ప్రైట్ సేల్స్ భారీగా పెరిగాయని కోకాకోలా వెల్లడించింది. సాఫ్ట్ డ్రింక్‌లు మరియు ఫ్రూట్ డ్రింక్ మాజా విక్రయాలు సైతం దీనికి కారణమయ్యాయని పేర్కొంది. కోకాకోలాకే చెందిన సాఫ్ట్ డ్రింక్ థమ్సప్ పోయినేడాదే బిలియన్ డాలర్ బ్రాండ్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే.