ఈరోజు రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ జరగనుంది. ఈ సభకు ప్రధాని మోదీ, జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు.
ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలు రాశారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల సందర్భంగా పార్లమెంటులో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చంద్రబాబు కోరారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో అల్లూరిని చేర్చడం సంతోషమని, ఈ విషయంలో తెలుగు ప్రజల తరపున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చంద్రబాబు చెప్పారు. జూలై 4న భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ ప్రజల మనసుల్లో గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. Read Also: RK…
ప్రధాని మోదీ జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో.. మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్లో బసకు ఏర్పాటు చేసారు అధికారులు. అయితే.. రాజ్‌భవన్‌లోనే మోడీ బస చేస్తారని తొలుత భావించారు. కాగా.. రాజ్‌భవన్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెచ్ఐసీసీ వరకు ప్రధాని రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు సమస్యగా మారుతాయని నిఘా వర్గాలు తెలిపారు. దీంతో.. ఎస్పీజీ సూచన మేరకు నోవాటెల్‌లోనే ప్రధాని బసను ఖరారు చేసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో…
ప్రధాని మోదీ జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో.. మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్లో బసకు ఏర్పాటు చేసారు అధికారులు. మోడీ రాకకు ముందుగా నిన్న (బుధవార)మే హైదరాబాద్‌కు చేరుకున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ బృందాలు నోవాటెల్ హోటల్లో స్థానిక పోలీసులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో.. ప్రధానితోపాటు పెద్ద సంఖ్యలో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు రానున్న సందర్భంగా.. భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. అయితే.. రాజ్‌భవన్‌లోనే మోడీ బస చేస్తారని తొలుత భావించారు.…
బీజేపీ శ్రేణులు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో సరికొత్త పోరు మొదలైంది. దీంతో.. హైదరాబాద్ లో.. ఫ్లెక్సీల వార్ సాగుతుంది. విమర్శలకు ప్రతి విమర్శలు ముదిరి ఫ్లెక్సీలు, కటౌట్ల వార్ వరకు వ్యవహారం వెళ్లింది. ఈనేపథ్యంలో.. ఫ్లెక్సీలు, కటౌట్లతో ‘సాలు దొర.. సెలవు దొర’అంటూ బీజేపీ మోత మోగిస్తుంటే, దానికి ప్రతిగా తాజాగా మంచిర్యాల జిల్లాలోనూ మోడీకి వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా.. చెన్నూరు నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లలో సాలు మోదీ.. సంపకు…
స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా జూలై 4న ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నారు. భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు. అయితే ప్రధాని మోదీ పర్యటనలో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొననున్నారు. భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని ఏపీలోని పలువురు ప్రముఖులకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆహ్వానాలు పంపుతున్నారు. కిషన్‌రెడ్డి ఆహ్వానం పంపిన వారి జాబితాలో చిరంజీవి కూడా ఉన్నారు. Read Also:…