తెలంగాణపై బీజేపీ శ్రేణులు దృష్టి సాదించారు. హుజూరాబాద్ కషాయి విజయంతో.. బీజేపీ ఫోకస్ ఎక్కువైంది. నగరంలో బీజేపీ కషాయి జెండా ఎగరవేసేందుకు సిద్దమైంది. జూలై 2వ తేదీన మోదీ , షా తో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు భారీగా బీజేపీ అభిమానులు హాజరవ్వాలని బీజేపీ కసరత్తు చేస్తోంది. సమయం దగ్గర పడుతుండటంతో.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఏర్పాట్లు వేగవంత మయ్యాయి. కాగా.. జూలై 2న ప్రధాని మోదీ నగరానికి రానున్న…
అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్ సహా ప్రపంచ దేశాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలోని మైసూర్ నుంచి యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో వేకువజామునుంచే ప్రముఖులు సహా సామాన్య ప్రజలు యోగాసనాలు వేస్తున్నారు. మానవత్వం కోసం యోగా(Yoga for humanity) అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కర్ణాటకలో ప్రధాని మోదీ ఈవెంట్లో సుమారు 15 వేల మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రధానితో పాటు కేంద్ర మంత్రి సర్భానంద…
ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా రచ్చ జరిగింది.. పలు ప్రాంతాల్లో భారీ విధ్వంసమే జరిగింది.. ఆ పథకాన్ని వెనక్కి తీసుకోవాలంటూ విపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.. అయితే, కేంద్రం మాత్రం వెనక్కి తగ్గకుండా మరో ముందుడుగు వేసి నోటిఫికేషన్లు కూడా జారీ చేసింది.. ఇక, అగ్నిపథ్పై ఆందోళన వ్యక్తం అవుతోన్న సమయంలో.. అగ్నిపథ్, ఆ పథకాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతోన్న ఆందోళనపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. కర్ణాటక పర్యటనలో…
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ ఈ నెల 18న శతవసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో జరగనున్న ఆమె పుట్టిన రోజు వేడుకల్లో మోదీ కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా వాద్నగర్లోని హటకేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పావగఢ్లోని కాళీమాత ఆలయంలో జరిగే పూజల్లోనూ మోదీ పాల్గొంటారు. తల్లి శత వసంత పుట్టిన రోజు వేడుకను పురస్కరించుకుని గాంధీనగర్లోని రైసన్ పెట్రోల్ పంపు నుంచి 60 మీటర్ల రోడ్డుకు ‘పూజ్య హీరా మార్గ్’ అని నామకరణం…
భారత్, ఇజ్రాయిల్, యూఎస్ఏ, యూఏఈ దేశాల కూటమి ఐ2యూ2 తొలి శిఖరాగ్ర సమావేశాలను యూఎస్ఏ నిర్వహించనుంది. ఈ భేటీ నాలుగు దేశాల అధ్యక్షులు పాల్గొననున్నారు. ఐ2యూ2 ఏర్పడిన తర్వాత జరగబోయే తొలి శిఖరాగ్ర సమావేశం ఇదే. ఇండియా, ఇజ్రాయిల్ దేశాల మొదటి అక్షరాలను కలిపి ఐ 2గా, యూఎస్ఏ, యూఏఈని కలిపి యూ 2 గా వ్యవహరిస్తారు. ఈ గ్రూప్ ను పశ్చిమాసియా క్వాడ్ గా కూడా అభివర్ణిస్తారు. భారత ప్రధాని నరేంద్రమోదీ, ఇజ్రాయిల్ ప్రధాని నఫ్తాలీ…
దేశంలో వైద్య ఆరోగ్య రంగానికి మోడీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే. కోవిడ్ వచ్చే సమయానికి దేశంలో ఆస్పత్రులు పరిస్థితి అంత మెరుగ్గా లేదు. రెండేళ్లలో దేశంలోని ఆసుపత్రులలో విస్తృతమైన మార్పులు వచ్చాయి. వైద్య రంగానికి ప్రధానమంత్రి మోడీ పెద్ద పీట వేశారన్నారు. అనంతపురం పర్యటనలో భాగంగా ఆమె మాట్లాడారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే కోవిడ్ మరణాలు దేశంలో తక్కువ అన్నార. కోవిడ్ వ్యాక్సిన్ తో పాటు…
దేశవ్యాప్తంగా ఉద్యోగం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రధాని మోదీ గుడ్ న్యూస్ అందించారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలను చేపట్టబోతోంది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ప్రధాని మోదీ ఆదేశించారు. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలలో మానవ వనరుల స్థితిగతులపై మంగళవారం నాడు ప్రధాని మోదీ సమీక్షించారు. ఈ మేరకు ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలను మిషన్ మోడ్లో భర్తీ చేయాలని వివిధ శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ…
ప్రధాని నరేంద్ర మోదీ జూలై 4న విశాఖ రానున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు జూలై 4న భీమవరం వస్తున్న నరేంద్ర మోదీ అదే రోజు సాయంత్రం 4 గంటలకు విశాఖలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని బీజేపీ వర్గాలు తెలియజేశాయి. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు తెల్లదొరల మీద అలుపెరగని పోరాటం చేసిన యోధుడు. ఆయన విశాఖ మన్యం బెబ్బులిగా మారి నాటి బ్రిటిష్ దొరల మీద భయంకరమైన యుద్ధం…
దేశంలో ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఉండాలనేది పీఎం మోడీ ఆలోచన అన్నారు కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రధానమంత్రి అవాస్ యోజన ఇల్లు నిర్మిస్తున్నాయన్నారు. విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో హౌసింగ్ ఫర్ ఆల్, పీఎం అవాస్ యోజన ఇళ్ళు లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర హౌసింగ్ మంత్రులు హరిదీప్ సింగ్ పూరి, జోగి రమేష్, ఎంపీ ఎంవివి, ఎమ్మెల్సీ మాధవ్, అధికారులు…
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాని మోదీ ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. 2 నెలల్లోనే నాలుగు సార్లు గుజరాత్లో పర్యటించిన మోదీ.. తాజాగా శుక్రవారం దాదాపు రూ. 3,050 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నవ్సారిలో జరిగిన ‘గుజరాత్ గౌరవ్ అభియాన్’లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రాష్ట్రంలో అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినందుకు గర్వంగా ఉందని.. గుజరాత్ ప్రజలతోనే…