Sanjay Singh allegations on modi government: ఇటీవల లలిత్ మోదీ-సుస్మితా సేన్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. మాల్డీవుల్లో లలిత్ మోదీ, సుస్మితాసేన్ డేటింగ్ చేసినట్లు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. మాల్దీవుల అనంతరం లండన్‌లో తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నట్లు లలిత్ మోదీ స్వయంగా ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఆప్ నేత సంజయ్ సింగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఐపీఎల్‌లో అవకతవకలతో దేశం విడిచి పారిపోయిన లలిత్ మోదీని ఇప్పటివరకు మోదీ ప్రభుత్వం పట్టుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. అయితే లలిత్ మోదీని మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ కనుక్కుందంటూ సెటైర్లు వేశారు.
Read Also: Govt Jobs: శుభవార్త.. మరో 2,440 ఉద్యోగాల భర్తీకి సర్కారు అనుమతి
ఆప్ మంత్రి మనీస్ సిసోడియాపై మద్యం పాలసీకి సంబంధించి సీబీఐ విచారణకు కసరత్తులు జరుగుతున్న నేపథ్యంలో సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశం విడిచి పారిపోయిన వ్యక్తులను పట్టుకోవడం ప్రధాని మోదీకి చేతకాదని సంజయ్ సింగ్ ఆరోపించారు. కేజ్రీవాల్ ప్రభుత్వ చిత్తశుద్ధిని, నిజాయతీని చూసి మోదీ సర్కారు భయపడుతోందని విమర్శలు చేశారు. తప్పుడు ఆరోపణలతో ఆప్ నేతలను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఇలాగే అరెస్ట్ చేశారని, ఇప్పుడు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను టార్గెట్ చేశారని సంజయ్ సింగ్ మండిపడ్డారు. లలిత్ మోదీతో సుస్మితా సేన్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని.. కానీ మోదీ ప్రభుత్వం ఆయన్ను ఎందుకు పట్టుకోలేకపోయిందని ప్రశ్నించారు.