PM Modi: దివ్యాంగ బాలుడి మాటలు విని ముచ్చటపడిన ప్రధాని మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో డిజిటల్ భారత్ వీక్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ దివ్యాంగ బాలుడితో ముచ్చటించిన మోదీ.. అతని మాటలు చూసి ముచ్చటపడిపోయారు. దృష్టి లోపం ఉన్న వారి సాధారణ జీవితాన్ని సులభతరం చేసేందుకు రూపొందించిన ఓ ఉత్పత్తికి.. దృష్టి లోపంతో బాధపడుతున్న బాలుడు ప్రథమేశ్ సిన్హా బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నాడు. థింకర్‌బెల్ ల్యాబ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న 11 ఏళ్ల ప్రథమేశ్ సిన్హాతో ప్రధాని ముచ్చటించారు. ఈ సంస్థ అంధులు బ్రెయిలీ లిపిని సులభంగా నేర్చుకునేందుకు వీలుగా ‘యాన్నీ’ అనే గ్యాడ్జెట్‌ను తయారు చేసింది. ‘యాన్నీ’ గ్యాడ్జెట్ గురించి ప్రత్యక్షంగా ప్రథమేశ్ సిన్హా ప్రధానికి వివరించాడు. దీన్ని ప్రధాని ఆసక్తిగా విని అతడి తలను నిమిరారు. ఏ రాష్ట్రం నుంచి వచ్చావంటూ ప్రశ్నించారు. పుణె నుంచి వచ్చానని బాలుడు సమాధానం ఇచ్చాడు. ప్రధాని మోదీ ఆ చిన్నారిని అభినందించారు.
అనంతరం ప్రధాని మాట్లాడుతూ ఆ బాలుడి గురించి ప్రస్తావించారు. తాను ఆ బాలుడితో మాట్లాడినప్పుడు ఆ అబ్బాయి కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ అంటూ తనను తాను పరిచయం చేసుకున్న తీరు అబ్బురపరిచిందని ప్రధాని మోదీ అన్నారు. ఇలాంటి వాళ్లను కలిసినప్పుడే.. ఈ దేశం ఎక్కడా ఆగిపోదని, భవిష్యత్తు కలలను సాకారం చేసుకుంటుందనే విశ్వాసం మరింత పెరుగుతుందని మోదీ ఆ చిన్నారిని అభినందించారు.
Also Read
- LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
- Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
Rajyasabha: రాజ్యసభకు త్రిపుర సీఎం రాజీనామా.. ఖాళీగా మరో సీటు
తన బ్రాండ్ అంబాసిడర్ అయిన ప్రథమేష్ సిన్హా ‘యాన్నీ’ గురించి ప్రధానికి వివరిస్తున్న వీడియోను థింకర్ బెల్ ల్యాబ్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమ ఉత్పత్తి గురించి గౌరవ ప్రధానినరేంద్ర మోదీకి ప్రథమేష్ సిన్హా వివరించడం గర్వకారణమని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ડિજિટલ ઇન્ડિયા વીક -2022 માં એક કંપનીના 11 વર્ષીય બ્રાન્ડ એમ્બેસેડરથી પ્રભાવિત થયા પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી pic.twitter.com/P0e1SnuskK
— BJP Gujarat (@BJP4Gujarat) July 4, 2022
తాజావార్తలు
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?